A woman’s experience : సాధారణంగా మనం కొత్త జాబ్ అప్లై చేస్తే ఏం చేస్తాం? రెజ్యూంలోని ఎంప్లాయ్ మెంట్ ప్రొఫైల్ లో విద్యార్హతలు, జాబ్ ఎన్ని ఏళ్లు చేశాం.. అనుభవం, గత కంపెనీలో సాలరీ వంటి వివరాలు నమోదు చేస్తాం. కొందరు పాత సంస్థ బాగోలేకపోయినా.. తేడాగా ఉంటే ఆ వివరాలు చెప్పకుండా దాచేస్తారు. చాలా మంది పెద్ద సంస్థలో చేసినట్టే బయోడేటాలో పేర్కొంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం తను ఇంతకుముందు ఏం చేసిందో అస్సలు దాచుకోలేదు. వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్లేసులో ధైర్యంగా ‘సెక్స్ వర్క్ ’ అని పెట్టుకుంది. లింక్డ్ ఇన్ లో రాసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

లింక్డ్ ఇన్ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ఫ్లాట్ ఫామ్ లో దాదాపు 9వేల మంది ఫాలోవర్స్ ఉన్న ‘ఏరియల్ ఇగోజి’ అనే మహిళ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్లేసులో తను ఇంతకుముందు చేసిన ‘సెక్స్ వర్క్’నే ప్రస్తావించి అందరికీ షాక్ ఇచ్చింది. చాలా మంది ఈమె ధైర్యానికి మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇగోజీ తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. సెక్స్ వర్క్ ద్వారా తాను స్వయం ఉపాధి పొందినట్టు నిర్మొహమాటంగా తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను ఏమాత్రం దాచుకోకుండా బయోడేటాలో పంచుకుంది. ‘తాను రెండు వారాల క్రితమే విలాసవంతమైన ఇన్ హౌజ్ జాబ్ వదిలిపెట్టానని.. అదేంటో కాదు ‘సెక్స్ వర్క్’ అని.. ఈ ఉద్యోగంతో తాను తగినంత పొదుపు చేశానని.. కానీ అందులో సంతోషం లేకపోవడంతో ఆ రొంపి నుంచి బయటపడడానికి ఇలా కొత్త జాబ్ కోసం చూస్తున్నానని’ లింక్డ్ ఇన్ పోస్ట్ లో పేర్కొంది.
ఏరియల్ ఎమోషనల్ సెక్స్ వర్క్ గురించి రాసుకొచ్చింది. “చెల్లించకూడదనుకునే వారి నుండి తిరస్కరణలను తీసుకోవడంలో నాకు ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే నేను ఎలాంటి భావోద్వేగ శ్రమ అవసరమో డబ్బులోనే వసూలు చేస్తున్నాను. అందులో నేను సరిహద్దులను సెట్ చేసాను. నాకు సురక్షితమైన, ఉల్లాసభరితమైన మరియు సమృద్ధిగా ఉండే మార్గాల్లో మాత్రమే శృంగారంలో పాల్గొంటాను. నా సమయాన్ని వృధా చేసుకోను. నేను దాని కోసం అందరినీ అడగడం.. చర్చలు జరపడం మానేశాను. నాకు నేను నిరూపించడానికి ఏమీ లేదు. నా విలువను స్పష్టంగా చెప్పడానికి నేను మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె ప్రకటించింది.
ఇక ధైర్యంగా ఇలా తన వర్క్ సెక్స్ అని చెప్పినందుకు నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఇది డేంజర్ గేమ్ అంటూ కొందరు ఆమెను హెచ్చరిస్తున్నారు. కానీ ఈ కాలంలో ఇలా చెప్పరాని విషయాన్ని అందరి ముందు ఓపెన్ గా చెప్పేసి ఇగోజి సంచలనానికి తెరతీసిందనే చెప్పాలి.