Devara Vs OG: దేవర తో ఓజీ క్లాష్ అవుతోందా..? ఎవరి సినిమాకు ఎంత సత్తా ఉందంటే..?

ఎపి ఎలక్షన్స్ ముగిశాక మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కూడా భారీ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు.

Written By: Gopi, Updated On : January 24, 2024 2:42 pm
Follow us on

Devara Vs OG: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలియాలంటే ఆయన సినిమాలు కలెక్ట్ చేసే కలెక్షన్స్ ని చూస్తే సరిపోతుంది. అయితే ఆయన ప్లాప్ సినిమా కూడా పక్క హీరో హిట్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ ని సంపాదిస్తున్నాయంటే ఆయనకి జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు.

ఎపి ఎలక్షన్స్ ముగిశాక మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కూడా భారీ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరొకసారి తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేసే దిశ గా ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కి మంచి పేరు వచ్చింది కానీ ఎన్టీఆర్ కి అసలు పేరే రాలేదు. ఇక దానివల్ల ఆయన ఇప్పుడు చేసే ప్రాజెక్టు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే కొరటాల శివ కి కూడా ఆచార్య ప్లాప్ తో బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది.ఇక తనని తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇదే మంచి అవకాశం అని తను కూడా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఓజీ’ సినిమా, ఎన్టీయార్ ‘దేవర’ సినిమా రెండు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ రెండింటి మధ్య క్లాషేస్ వస్తే మాత్రం ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. నిజానికి పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఓజీ సినిమా మీద అందరిలో భారీ అంచనాలు అయితే ఉన్నాయి.

ఇక సుజిత్ కూడా ఇంతకుముందు ప్రభాస్ తో చేసిన సాహో సినిమా కూడా బాలీవుడ్ లో సక్సెస్ అయింది. కాబట్టి తనకి కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. డైరెక్టర్ పరంగా చూసుకున్న, హీరో పరంగా చూసుకున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఓజి తో పోల్చుకుంటే దేవర సినిమా మీద అంచనాలైతే కొంచం తక్కువగా ఉన్నాయి. అయితే అంచనాల వల్ల ఓపెనింగ్స్ వస్తాయి. ఇక వాటిని పక్కన పెడితే నిజానికి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాగా ఆడతాయనేది ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా సంక్రాంతి సినిమాలా విషయం లో కూడా ఇది ప్రూవ్ అయింది. బరిలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నా కూడా ఒక యంగ్ హీరో అయిన తేజ సజ్జా భారీ సక్సెస్ కొట్టాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన హనుమాన్ సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో…ఇక ఇప్పుడు ఓజీ, దేవర మధ్య పోటీ లో కూడా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి…