Defecation : తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తున్నారా?

ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీని తరువాత, హానికరమైన కిరణాల మొత్తం పెరుగుతుంది.

Written By: NARESH, Updated On : October 20, 2024 11:04 pm

Going to defecate immediately after eating

Follow us on

Defecation : ఆహారం తీసుకోవడం ఎంత సాధారణమో టాయిలెట్ కి వెళ్లడం కూడా ప్రతి ఒక్కరి విషయంలో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. నిజానికి మల విసర్జన సరిగ్గా జరగకపోవడం కూడా పెద్ద ఆరోగ్య సమస్యనే అంటున్నారు నిపుణులు. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఒక విషయం మీరు గమనించారా? చాలా మందికి తింటేనే వాష్ రూమ్ కు వెళ్లడం అలవాటు ఉంటుంది. చదవడానికి ఫన్నీగా అనిపించినా ఇదే నిజం. అంటే.. ఉదయం పూట కనీసం వారు అల్పాహారం చేస్తేనే మలవిసర్జన చేస్తారు అన్నమాట.

రోజులో ఒకటి లేదా, రెండు సార్లు టాయిలెట్ కు వెళ్లడం కూడా చాలా మందికి సహజమే. అయితే మనం తీసుకున్న ఆహారం లోని పోషకాలను శరీరం గ్రహించిన తర్వాత.. మిగిలిన వ్యర్థాలు మలవిసర్జన రూపంలో బయటకు వస్తుంటాయి. అయితే.. ఆహారం తిన్న ప్రతిసారీ.. ఇలా బాత్రూమ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కచ్చితంగా ఆలోచించాలి.

కొన్నిసార్లు విటమిన్ లోపం వల్ల కూడా తరచుగా మలం సమస్యలు ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. శరీరంలోని అన్ని విధులను సక్రమంగా నిర్వహించడం విటమిన్ల పని. విటమిన్లు ఎముకల బలాన్ని కాపాడటంలో సహాయం చేస్తాయి. మలం లేదా అతిసారం IBS లక్షణం. ఈ సమయంలో ఏదైనా తిన్న వెంటనే టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంటుంది. ఐబిఎస్ లక్షణాలతో బాధపడేవారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుందట. కాబట్టి, అలాంటి వారు విటమిన్ డి ని అందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.

లక్షణాలతో సంబంధం లేకుండా, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కడుపు సమస్యలను కలిగిస్తుందట. కడుపు నొప్పి,కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, అలసట, శక్తి లేకపోవడం, తిమ్మిర్లు, వెన్నునొప్పి, మూత్ర సమస్యలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు.. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు కాల్షియంను గ్రహించలేవు అంటున్నారు నిపుణుల. క్రమంగా, బోలు ఎముకల వ్యాధి ఒక వ్యాధిగా మారుతుంది.ఎముకలు బలహీనంగా మారతాయి. చిన్నదెబ్బలకు ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటివారు.. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలా చేస్తే కాస్త సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం…

విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. పాలు, కాటేజ్ చీజ్ ,పెరుగు , కాడ్ లివర్ ఆయిల్ , సాల్మన్ ఫిష్, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగు , ఉదయం సూర్యకాంతి వంటి వాటిలో ఫుల్ గా విటమిన్ డి లభిస్తుంది. మంచి విటమిన్ డి కోసం సూర్యరశ్మి మరింత ముఖ్యం. సూర్య కిరణాలు శరీరంపై పడగానే సహజసిద్ధమైన విటమిన్ డి తయారవుతుంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీని తరువాత, హానికరమైన కిరణాల మొత్తం పెరుగుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..