Modi Chandrababu Jagan : దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి ప్రధాని మోడీ పిలిచిన తర్వాత పోకపోతే బాగోదు. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో నిర్వహించే 75 ఏళ్ల స్వాతంత్య్ర పండుగ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో హాజరు కావడానికి వెళుతున్నారు.

సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారిని అధికారంలో ఉన్న వారు పట్టించుకోరు. ఇక మోడీకి ఏం ప్రేమ పుట్టిందో కానీ ప్రతిపక్షంలో ఉండి ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుపై ప్రేమ కలిగింది. ఆయనను ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి పిలిచాడు. ఇక్కడే చిక్కొచ్చి పడింది.
గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు భార్యపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడారని.. లోకేష్ పై నోరుపారేసుకున్నారని బోరున ఏడ్చేసిన చంద్రబాబు ఇక తాను సీఎం అయ్యేవరకూ అసెంబ్లీ అడుగుపెట్టనని ప్రతినబూనారు. జగన్ పై ప్రతీకారంతో రగిలిపోయారు.
ఇక జగన్ సైతం తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబును శత్రువుగా చూస్తున్నారు. ఆయనపై వాడే భాష, చేసే రాజకీయం.. వ్యవహరించే తీరు మాత్రమే అంతా చంద్రబాబును అథ: పాతాళానికి తొక్కేయాలనే ఉంటుంది. వ్యక్తిగత ద్వేషాన్ని మించి జగన్ సాధిస్తుంటాడు.
ఈ ఇద్దరు బద్రశత్రువులను ఇప్పుడు ప్రధాని మోడీ కలపాలనుకుంటున్నాడు. అది సాధ్యమయ్యే పనికాదని తెలిసినా పూనుకున్నాడు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి అయినా.. మోడీ కోసం తమ పాత పగలు అంతా పక్కనపెట్టి మరీ మోముపై సూట్ కానీ కృత్రిమ నవ్వులను పలుముకొని జగన్, చంద్రబాబులు ఒకవేదికపై కూర్చోవడానికి రెడీ అయ్యారు.
ఈ పరిస్థితికి మోడీపై జగన్ కు ఉన్న ‘భక్తితో కూడిన భయంతో కలిగిన గౌరవం’ అని చెప్పొచ్చు. ఇక చంద్రబాబు ఓడిపోయి ఇప్పుడు డమ్మీ అయిపోయారు. మోడీతో పెట్టుకునే ఓపిక సహనం బాబుకు లేదు. మోడీ కాల్ చేస్తేనే పొంగిపోయి పొర్లుదండాలు పెట్టే స్థితిలో బాబు ఉన్నాడు. అలాంటి మోడ స్వయంగా పిలిస్తే పిలవని పేరంటానికైనా వెళతాడు. అందుకే ఢిల్లీకి వెళుతున్నాడు. మరి ఈ ఇద్దరు శత్రువులు జగన్, చంద్రబాబులను మోడీ కలుపుతారా? లేదా? అన్నది వేచిచూడాలి.