PM Modi : “వచ్చే ఆగస్టు 15 ఎర్రకోట నుంచి తిరిగి మాట్లాడతాను” – మోడీ

గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఆర్థికంగా కునారిల్లుతున్న టైంలో భారత్ ఆర్థికంగా పుంజుకుంది. ప్రపంచ సంస్థలన్నీ కూడా భారత్ దే ఈ దశాబ్ధం అని చెప్పేశాయి. ఎందుకు చెబుతున్నాయంటే మోడీ ఘనతనే.

Written By: NARESH, Updated On : August 17, 2023 2:31 pm

PM Modi : “వచ్చే ఆగస్టు 15 ఎర్రకోట నుంచి తిరిగి మాట్లాడతాను” ఇదీ ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం నుంచి చెప్పింది. మోడీని ఈ ప్రకటన తర్వాత అహంకారిగా.. అభిమానులందరూ గర్వంగా భావిస్తున్నారు. వాస్తవం చూస్తే మోడీ ఎందుకు ఇంత ధీమాగా మాట్లాడుతున్నారని చూస్తే.. మోడీ మాట్లాడినదానికి కారణాలు ఏంటని చూస్తే..

గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఆర్థికంగా కునారిల్లుతున్న టైంలో భారత్ ఆర్థికంగా పుంజుకుంది. ప్రపంచ సంస్థలన్నీ కూడా భారత్ దే ఈ దశాబ్ధం అని చెప్పేశాయి. ఎందుకు చెబుతున్నాయంటే మోడీ ఘనతనే.

జులైలో ద్రవ్యోల్బణం కట్టడి చేయడం.. జీడీపీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతటి ఆర్థిక మందగమనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేళ పదమూడున్న కోట్ల మందిని పేదరికం నుంచి మోడీ బయటకు తీసుకురాగలిగాడు. ఆత్మ విశ్వాసం ప్రజల్లో పెంపొందించగలిగారు. ఇది మోడీ మొట్టమొదటి ధీమాకు కారణం.. పటిష్టమైన భారత్ ఆర్థిక వ్యవస్థనే మోడీ నమ్మకానికి కారణం.

ఇక రెండోది ప్రజల్లో మోడీ పాపులారిటీ ఇప్పటికీ తగ్గలేదు. ప్రభుత్వం, పార్టీల కన్నా.. మోడీ వ్యక్తిగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని ప్రతీ ఒక్కరూ చెబుతున్నారు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఒపినీయన్ పోల్స్ లో మోడీనే వస్తున్నారు. మోడీకి అందుకే ధీమా ఉంది.

మోడీ ఆత్మవిశ్వాసంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.