India Vs Pakistan Reserve Day: ఇండియా పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కి ఏసిసి రిజర్వ్ డే ప్రకటించింది. అయితే ఎందుకు ఈ ఒక్క మ్యాచ్ కి రిజర్వ్ డే ప్రకటించారు ఇండియా శ్రీలంక మ్యాచ్ కి కానీ, ఇండియా బాంగ్లాదేశ్ మ్యాచ్ కి కానీ, పాకిస్థాన్ శ్రీలంక మ్యాచ్ కి కానీ, పాకిస్థాన్ బాంగ్లాదేశ్ మ్యాచ్ కి కానీ లేని ఈ రిజర్వ్ డే ఇప్పుడు ఇండియా పాకిస్థాన్ మ్యాచుకి మాత్రమే ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది…నిజంగా చెప్పాలంటే ఇది శ్రీలంక బాంగ్లాదేశ్ టీం లకి అన్యాయం చేస్తున్నట్టు కాదా వాళ్ళ మ్యాచులకి వర్షం వచ్చి రద్దు అయి పొతే వాళ్ళకి తల ఒక పాయింట్ వస్తుంది దానివల్ల వాళ్ళు ఫైనల్ కి వెళ్లాల్సిన అవకాశం కోల్పోవచ్చు కదా మరి ఏసిసి ఎందుకు ఇలా చేసింది అంటే ఇండియా శ్రీలంక, పాకిస్థాన్ శ్రీలంక మ్యాచులు ఎవరు చూడరు అవి జరిగిన జరగపోయిన ఏసిసి కి పెద్దగా వచ్చే లాభం ఏం ఉండదు.
కానీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ని మాత్రం ప్రపంచం లో ఉన్న అందరు చూస్తారు. దానికి బ్రాడ్ కాస్ట్ వాళ్ళు కొన్ని కోట్లల్లో డబ్బులు పే చేస్తారు.యాడ్స్ మీదనే కొన్ని వేళా కోట్ల మనీ అనేది ఏసీసీ కి వస్తుంది.కాబట్టి ఈ మ్యాచ్ ని ఎలాగైనా జరిగేలా చూస్తుంది ఏసీసీ… ఒక వేళా ఈ మ్యాచ్ జరగలేదనుకో వాళ్ళ యాడ్స్ ప్లే అవ్వవు కాబట్టి వాడు ఛానెల్ వాడికి డబ్బులు ఏం పే చేయడు దాంతో ఛానెల్ వాడు ఏసీసీ కి ఏం పే చేయడు కాబట్టి దానివల్ల ఏసీసీ చాలా విపరీతమైన డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది.అందుకే ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ని నిర్వహించారు.ఇప్పటికే ఈ రెండు టీం ల మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ రద్దు అవ్వడం తో ఏసీసీ భారీ గా నష్టపోయింది. మరి ఈ మ్యాచులు ఆడేది శ్రీలంక లోనే కదా దీనికి శ్రీలంక ఎలా ఒప్పుకుంటుంది మా మ్యాచులకి రిజర్వ్ డే లేనప్పుడు మిగితా వాళ్ళ మ్యాచులకి రిజర్వ్ డే ఎలా ప్రకటిస్తారు అని శ్రీలంక బోర్డు ఒక క్వశన్ చేయచ్చు కదా అనే డౌట్ మనకు రావచ్చు,క్వశన్ చేయవచ్చు కానీ శ్రీలంక బోర్డు అయినా బాంగ్లాదేశ్ బోర్డు అయినా క్వశన్ చేయరు ఎందుకంటే శ్రీలంక కి కూడా తెలుసు ఏసీసీ కి డబ్బులు వస్తేనే శ్రీలంక కానీ, బాంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, బాంగ్లాదేశ్ కానీ, పాకిస్థాన్ కి కానీ ఇలా ఏషియా కప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీం కి పార్టిసిపేట్ ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది.ఏసీసీ దగ్గర మని ఉంటేనే వాళ్ళు పార్టిసిపేట్ ఫీజ్ అనేది పే చేస్తారు లేకపోతే ఎలా పే చేస్తారు.మరి ఏసీసీ దగ్గర మని ఉండాలి అంటే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరగాలి.ఆలా జరిగితేనే టీవీ లో మ్యాచ్ వస్తుంది యాడ్స్ ప్లే అవుతాయి డబ్బులు వస్తాయి.
అందులో కూడా ఎదో ఒక దేశం విజయం సాదించాలి.అయితే ఇందులో పార్టిసిపేట్ ఫీజ్ ఇండియా తీసుకోదు మిగిలిన అన్ని జట్లకు ఇస్తారు అంతే తప్ప ఇండియా అందులోనుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదు.నిజానికి ఈ ఏసీసీ బోర్డుని కాపాడుకుంటూ వస్తుందే బిసిసిఐ ఒకసారి బిసిసిఐ ఏషియా కప్ కనక ఆడకపోయినా ఏసీసీ బోర్డు ని పట్టించుకోకపోయినా ఏషియా కప్ అనేది ఉండదు. దానివల్ల మిగితా దేశాలకి పార్టిసిపేట్ ఫీజ్ లాంటివి వెళ్లవు…ఇలా రిజర్వ్ డే పెట్టడం వెనక ఇంత పెద్ద కథ ఉంది…
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Why reserve day for india pakistan match this is the real story behind it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com