Rental Agreement: ఒకరు తమ భూమిని కొన్ని అవసరాల కోసం ఇతరులకు అప్పగించడాన్ని అద్దె(లీజు)కు ఇవ్వడం అంటారు. ఇలా తన భూమిని వాడుకునేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం చేసుకున్న ప్రకారం కొంత మొత్తం చెల్లించాలి. అయితే ఇలా అద్దెకు ఇచ్చే ముందు కొన్ని నిబంధనలు పాటించాలి. ఒకసారి భూమిని అద్దెకు ఇచ్చిన తరువాత ఆకస్మికంగా తొలగింపుతో పాటు ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం జరగకుండా ఒప్పంద పత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం లీజుకు తీసుకున్నట్లయితే ఇద్దరి మధ్య ఒప్పంద పత్రం నమోదు తప్పనిసరి. దీనికి రిజిస్ట్రేషన్ చట్టం, ఆస్తి బదిలీ చట్టం వర్తిస్తాయి. అయితే చాలా మంది ఇలాంటి సందర్భాల్లో ఒక సంవత్సరం కంటే తక్కువ అంటే 11 నెలలు మాత్రమే అద్దె ఒప్పందం చేసుకుంటారు. ఇలా 11 నెలలు మాత్రమే వ్యవధి పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది.. దాని గురించి తెలుసుకుందాం.

ఇద్దరి వ్యక్తుల మధ్య భూ బదలాయింపు ఉన్నప్పుడు అగ్రిమెంట్ తప్పనిసరి. అయితే రెండు పార్టీలు ఆయా అవసరాల కోసం వ్యవధిని నిర్ణయించుకుంటారు. కొందరు సంవత్సరం పాటు నిర్ణయించుకుంటే మరికొందరు 3 నుంచి 4 సంవ్సరాల ఒప్పందం చేసుకుంటారు. ఒక ఆస్తిని 3 నుంచి 5 సంవత్సరాలు అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక సంవత్సరం వరకు ఒక రకంగా.. ఆ తరువాత వ్యవధికి మరో రకంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒకవేళ ముందు ఒక సంవత్సరం అగ్రిమెంట్ పూర్తి అయిన తరువాత మళ్లీ దానిని పొడగించుకోవచ్చు.
Also Read: Delhi Liquor Policy Scam: మద్యం వ్యాపారంలో అక్రమాలు.. ఆమ్ ఆద్మీ పార్టీ సుద్ధ పూస కాదు
అద్దె ఒప్పందం వివిధ రకాలుగా ఉంటుంది. 11 నెలల పాటు అద్దె తీసుకుంటే దానిని ‘లీజు-లైసెన్స్ ఒప్పందం’ అని అంటారు. ఈ వ్యవధి ముగిసిన తరువాత మరో 11 నెలలు పొడిగించుకుంటే మరోసారి దీనిని పునరుద్దరిస్తారు. అయితే 11 నెలల కంటే ఎక్కువ కాలం అద్దెకు తీసుకోవాలనుకుంటే ‘లీజు ఒప్పందం’ అని పేర్కొంటారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఏ వ్యవధికైనా అగ్రిమెంట్ తప్పనిసరి. కానీ ఆయా కాలాలను బట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక యాజమాన్య ఆధారంగా ఒప్పందం చేసుకుంటే రెండు రకాలుంటాయి. ఒకటి వ్యక్తిగత అద్దె.. రెండోది వాణిజ్య లీజు ఒప్పందం. కొన్ని సందర్భాల్లో ‘త్రైపాక్షిక ఒప్పందం’ కూడా చేసుకోవచ్చు.

2019 జూలైలో మోడల్ టెనెన్సీ చట్టం(MTA)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నాయి కూడా. ఆస్తి అద్దెలను నియంత్రించడానికి ఈ చట్టం పనిచేస్తుంది. ఈ చట్టం ప్రకారం అద్దె ఒప్పందం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇందులో కొన్ని నియమాలున్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ క్యాపింగ్, అద్దె చెల్లించనందుకు కోర్టు జోక్యం, అద్దెకు తీసుకున్న ఆస్తిని సబ్ లెట్ చేయడం, అద్దె వ్యవధిలో ఆకస్మిక అద్దె పెంపుదల లేదు, అద్దె దారుడిని సందర్శించే 24 గంటల ముందు నోటీసులు లాంటి నియమాలున్నాయి. ఈ నియమాల ప్రకారం ఎంటీఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.
వాస్తవానికి ఒక సంవత్సరం అద్దె వ్యవధి నిర్ణయించుకున్నవారు 12 నెలల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ లీజు ఒప్పందం 11 నెలల వరకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17 లోని అద్దె ఒప్పందాన్ని ఒక విధంగా లీజు దస్తావేజుగా పరిగణిస్తారు. 11 నెలలలోపు లీజు దస్తావేజుగా పరిగణించిన వారు ఆ కాలం దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే స్టాంప్, డ్యూటీ కి సంబంధించిన ఖర్చులు చెల్లించాలి. ఈ ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఇలా 11 నెలల వ్యవధి మాత్రమే నిర్ణయించుకుంటారు.
[…] Also Read: Rental Agreement: అద్దె ఒప్పందం 11 నెలలు మాత్రమే ఎ… […]