కంప్యూటర్ కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకుండవో తెలుసా..?

దేశంలో రోజురోజుకు కంప్యూటర్, ల్యాప్ టాప్ వాడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి ఉద్యోగాల చేసే వాళ్ల వరకు చాలామంది కంప్యూటర్, ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. అయితే వాటి కీ బోర్డులను పరిశీలిస్తే అక్షరాలు వరుస క్రమంలో ఉండవు. కీ బోర్డులో ఎ తరువాత బి కాకుండా ఎస్ ఉంటుంది. కంప్యూటర్ కీస్ ను పరిశీలిస్తే అవి చాలా గందరగోళానికి గురి చేసే విధంగా ఉంటాయి. Also Read: రైతులకు ఆ రాష్ట్ర […]

Written By: Navya, Updated On : February 5, 2021 3:10 pm
Follow us on

దేశంలో రోజురోజుకు కంప్యూటర్, ల్యాప్ టాప్ వాడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి ఉద్యోగాల చేసే వాళ్ల వరకు చాలామంది కంప్యూటర్, ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. అయితే వాటి కీ బోర్డులను పరిశీలిస్తే అక్షరాలు వరుస క్రమంలో ఉండవు. కీ బోర్డులో ఎ తరువాత బి కాకుండా ఎస్ ఉంటుంది. కంప్యూటర్ కీస్ ను పరిశీలిస్తే అవి చాలా గందరగోళానికి గురి చేసే విధంగా ఉంటాయి.

Also Read: రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. రుణాలు మాఫీ..?

మనం సాధారణంగా కంప్యూటర్, ల్యాప్ టాప్ లలో క్వర్టీ కీ బోర్డును వినియోగిస్తాం. క్వర్టీ కీ బోర్డును 1868వ సంవత్సరంలో క్రిస్టోఫర్‌ షోల్స్‌ అనే వ్యక్తి తయారు చేశాడు. కీ బోర్డులో పై వైపును ఉండే మొదటి ఆరు ఇంగ్లీష్ అక్షరాలను కలిపి క్వర్టీ అని పిలుస్తాం. క్రిస్టోఫర్‌ షోల్స్ ఈ కీ బోర్డు కంటే ముందు వరుస క్రమంలో ఉన్న కీ బోర్డులను పరిశీలించిన సమయంలో ఆ కీబోర్డులలో కొన్ని సమస్యలను గుర్తించాడు.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,100కే కొత్త స్మార్ట్‌ఫోన్..?

ఇంగ్లీష్ భాషలోని పదాలలో కొన్ని లెటర్స్ ఎక్కువగా వస్తే మరి కొన్ని లెటర్స్ మాత్రం పదాలలో అరుదుగా వస్తుంటాయి. q, z, w, x, లాంటి అక్షరాలు ఇంగ్లీష్ లో చాలా అరుదుగా వస్తాయి. అలా కాకుండా వోవెల్స్ అక్షరాలు a, e, i, o, u, అక్షరాలను p, b, l, m, n, k, l లాంటి అక్షరాలను మనం కీబోర్డులో ఎక్కువగా ఉపయోగిస్తాం. అలా ఎక్కువసార్లు వచ్చే లెటర్స్ ను పరిశీలించి వాటిని వరుస క్రమంలో కాకుండా అనువైన స్థానాల్లో అమర్చి క్రిస్టోఫర్‌ షోల్స్‌ క్వర్టీ కీ బోర్డును తయారు చేశారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

క్రిస్టోఫర్‌ షోల్స్‌ టైప్ మిషన్ కొరకు ఈ కీ బోర్డును తయారు చేయగా ఆ తరువాత కంప్యూటర్, ల్యాప్ టాప్ లలో కూడా ఇదే తరహా కీ బోర్డు అందుబాటులోకి వచ్చింది. సులువైన ‘కీ బోర్డు’గా పేరు తెచ్చుకున్న ఈ కీ బోర్డు వల్ల చేతివేళ్లకు శ్రమ తగ్గుతుందని చెప్పాలి.