BJP : అసెంబ్లీ ఎన్నిక అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి సమీక్ష చేసుకునే సమయం. ముందుగా బీజేపీ దీని బలమేంటి? బలహీనత ఏంటన్నది తెలుసుకోవాలి.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. దాదాపు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ఉనికి చాటుకుంది. బలహీనత ఏంటో చూస్తే.. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో కేవలం 47 నియోజకవర్గాల్లోనే బీజేపీ తన ఉనికిని చాటుకుంది. బీజేపీకి 15 శాతం కూడా ఓటింగ్ లేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో అసలు పోటీ లేకుండా మిగతా అంశాలు చర్చించుకుంటున్నారు.
బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్షుడిగా తీసేయడం.. కవిత అరెస్ట్ కాకుండా ఆపడం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ముందు పెడుతున్నారు. కానీ ఇదంతా తప్పు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి.
బీజేపీకి భవిష్యత్తు ఎందుకు ఆశాజనకంగా వుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.