Bjp Manchu Vishnu:‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపుతో కొందరికి మోదం.. కొందరికి ఖేదం మిగిలింది. నిజానికి అందరూ ప్రకాష్ రాజ్ గెలుస్తాడని అనుకున్నారు. ఎందుకంటే అతడికి మెగా హీరోల నుంచి మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు.. పెద్ద హీరోల నుంచి విశేషమైన మద్దతు లభించింది. కానీ అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ఓడి మంచు విష్ణు గెలిచాడు. అగ్ర సినీ ప్రముఖులను నమ్ముకొని పోల్ మేనేజ్ మెంట్ లో ప్రకాష్ రాజ్ వెనుకబడడమే కారణంగా తెలుస్తోంది. ఇక నాన్ లోకల్ నినాదం కూడా బాగానే పనిచేసిందని అంటున్నారు.

మంచు విష్ణు గెలుపుతో ఇప్పుడు ఆయన వర్గం మాత్రం సంతోషంలో మునిగిపోయింది. ప్రకాష్ రాజ్, మెగా ఫ్యామిలీ విషాదంలో నిండిపోయింది. అయితే అందరికంటే ఎక్కువ సంతోషం బీజేపీలో ఉందట.. ఈ మేరకు విష్ణు గెలుపును బీజేపీ సంబరాలు చేసుకుంటోందట.. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం మంచు విష్ణు గెలుపును కొనియాడడం విశేషం.
మంచు విష్ణు ప్యానెల్ లో బీజేపీ నేత, సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కూడా పోటీచేశాడు. అంతేకాదు.. బీజేపీని తీవ్రంగా ద్వేషించే ప్రకాష్ రాజ్ ను ఓడించడానికి బీజేపీ కూడా చాలానే కృషి చేసినట్టు టాక్. అందుకే ఆయన ఓడి విష్ణు గెలవగానే బండి సంజయ్ సైతం ట్వీట్ చేసి అభినందించారు.
బండి సంజయ్ తన ట్వీట్ లో ప్రకాష్ రాజ్ ను కడిగేశాడు. ఆయన యాంటీ బీజేపీ, జాతీయ వాద రాజకీయాలను ఎండగట్టాడు.. ‘‘మా” అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణఉతో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.’’ అంటూ బండి సంజయ్ ట్వీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మా’ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్న నిర్ణయం తెలుగురాష్ట్రాల్లోనూ ప్రతిధ్వనించాలని బండి సంజయ్ కోరుకున్నారు. స్ఫూర్తిదాయకమైన తీర్పునిచ్చారని.. అందరికీ అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
దీన్ని బట్టి మంచు విష్ణు గెలుపును.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ ఓటమిని బీజేపీ స్వాగతించింది. పరోక్షంగా మద్దతు కూడా ఇచ్చిందని తెలుస్తోంది.
"మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.
జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021