Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఆతృతగా, ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ పుట్టినరోజు కావడంతో హిమ తనకు విష్ చేయలేదని బాధపడతాడు. ఇదే సమయంలోనే కుటుంబ సభ్యులందరూ కూర్చొని పిల్లలు పేపర్ చదవడం వారు కార్తీక్ తో మాట్లాడకపోవడం గురించి ఆలోచిస్తూ బాధపడతారు.అంతలోనే థాంక్యూ అంటూ అక్కడికి వచ్చిన కార్తీక్ అందరూ విషెస్ చెబుతున్నారు మమ్మీ ఒక హిమ మాత్రం నాకు విషెస్ చెప్పడం లేదు అంటూ బాధపడతాడు. అప్పుడు సౌందర్య హిమ విషెస్ చెప్పక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అది మోనిత ఉన్న పేపర్ చూసిందట అని చెప్పగానే కార్తీక్ షాక్ అవుతూ.. వాట్ హిమ పేపర్ చూసిందా? నువ్వేం చేస్తున్నావ్ దీప.. అంటూ దీప పై కోపడతాడు. సౌర్య అపార్థం చేసుకోలేదు కానీ హిమ చాలా బాధపడుతుంది. అయినా తన మిమ్మల్ని కలవడానికి హాస్పిటల్ కి వచ్చిందట అప్పుడు మీరు ఆపరేషన్ లో ఉన్నారని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదనీ దీప చెబుతుంది.

ఆ సమయంలో సౌందర్య మాట్లాడుతూ నువ్వంటే దానికి ఎంతో ఇష్టం పెళ్లి బ్రతిమాలు పోరా మాట్లాడుతుందని చెప్పగా మోనిత అన్న మాటలను గుర్తు చేసుకుంటూ కార్తీక్ భయంగానే బయట కూర్చున్న హిమ దగ్గరకు వెళ్తాడు. ఇక కట్ చేస్తే మోనిత సుకన్యను పొగుడుతూ ఉంటుంది.ఇలా చెప్తే అలా అన్ని చేస్తున్నావ్ థాంక్యూ సుకన్య బుట్ట నిండా యాపిల్స్ తీసుకొని ఇవన్నీ అందరికీ పంచు అని చెబుతుంది. ఇకపోతే మోనిత కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంటికి వెళ్లే పేపర్ కి మాత్రం కాకుండా మిగతా అన్ని పేపర్లకు కార్తీక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యాడ్ ఇస్తుంది. నేను మీ రెండో భార్యని ఈ ప్రపంచమంతా నమ్మే విధంగా దానిని నువ్వు ఒప్పుకునే విధంగా చేస్తున్నాను కార్తీక్ అంటూ మనసులో అనుకుంటుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన భాగ్యం రీ ఎంట్రీ ఇస్తుంది.
బయట దిగాలుగా కూర్చున్న హిమ దగ్గరకు కార్తీక్ భయంగా వెళ్తూనే తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కార్తీక్ దగ్గరకు రాగానే లేచివెళ్తుంది ఈ సన్నివేశాన్ని కుటుంబ సభ్యులతో పాటు ప్రియమణి అక్కడే ఉండి ఎంతో ఆతృతగా చూస్తుంటారు. నువ్వు పేపర్ చూశావా అవన్నీ అబద్ధాలే అందులో నిజం లేదు అని చెప్పగానే నువ్వు అబద్ధం చెపుతున్నావు డాడీ అవన్నీ నిజాలు. అబద్దం అయినప్పుడు మోనిత ఆంటీ హాస్పిటల్ కు ఎందుకు వచ్చింది? అని అనడంతో అందరు షాక్ అవుతారు.నేను మోనిత ఆంటీ మాట్లాడిన మాటలు అన్నీ విన్నాను తను అలా అడుగుతుంటే మీరేం సమాధానం చెప్పలేదు అంటే మీది తప్పు ఉన్నట్టే అంటూ గట్టి గట్టిగా అరుస్తూ తన డాడీని నిలదీస్తుంది. నువ్వు చెప్పు డాడీ మేము విజయనగరం వెళ్లాక ఆంటీని పెళ్లి చేసుకుంటానని చెప్పావా.. లేదా ఇది నిజం కాదా అమ్మను ఎందుకు మోసం చేశావు అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు వేస్తూ కార్తీక్ ను నిలదీస్తుంది. అందుకు కార్తీక్ నేను చెప్పేవన్నీ నిజాలే మోనిత మోసం చేసింది అందుకే జైలుకు వెళ్ళింది అంటూ మోకాళ్లపై నిలబడి తన కూతురిని బ్రతిమాలుతూ ఉంటాడు. కార్తీక్ ఎన్ని చెప్పినప్పటికీ హిమ మనసు మాత్రం కరగదు.