Petrol, Diesel Prices: సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రో ధరల పెరుగుదలతో అన్నింటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఏం కొనేట్టు ఏం తినేట్టు లేదని మథనపడుతున్నారు. రోజురోజుకు ఇలా ధరలు పెరిగితే ఇక బతికేదెలా అని ఆందోళన చెందుతున్నారు. పెట్రోధరల పెరుగుదలపై వాహనదారులపై అదనపు భారం పడుతూనే ఉంది. అసలే కరోనా పరిస్థితులతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు తోడు ధరల పెరుగుదల నిద్ర పట్టకుండా చేస్తోంది. వాహనాలు బయటకు తీయాలంటేనే భయమేస్తోంది. పెట్రోల్ ధరలతో ప్రజలు కకావిలకం అవుతున్నారు.

దేశంలో పెట్రోల్ ధర రూ.110 లకు చేరుకుని గుండెల్ని పిండేస్తోంది. అనేక నగరాల్లో పెట్రోల్ ధర రూ.110, డీజిల్ ధర రూ.100 దాటేసింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం రూ.3 లు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించింది. కానీ వరుసగా పెరుగుతున్న ధరలతో ప్రజలు సమిధలు అవుతున్నారు. ఈ ధరల పెరుగుదలకు అంతమే లేకుండా పోతోంది.
పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ ధిశగా అడుగులు వేయడం లేదు. స్టేట్లు ఒప్పుకోవడం లేదనే సాకుతో ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ ధర సగానికి పైగా తగ్గనుంది. దీంతో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ధరలు కూడా అదుపులోకి వస్తాయి. దీంతో సామాన్యుడి జీవితం సాఫీగా సాగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు అమాంతం పెరగడంపై ఆందోళన నెలకొంది.
చమురు సంస్థలు రోజురోజుకు ధరలు పెంచడంతో పెట్రో ధరలు విపరీతంగా పెరగుతున్నాయి. ఫలితంగా ప్రజల నెత్తిన పెనుభారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు గతంలోకంటే భిన్నంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరల్లో చోటుచేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలు సవరించాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు మాత్రం సామాన్యుడి గోడు పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిత్యం పెరుగుతున్న ధరలతో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.