PM Modi : మోడీకి ఉన్న క్రేజ్ ప్రపంచంలోని ఏ దేశాధ్యక్షుడికి లేదు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ సర్వేలో ఈ విషయం మరోసారి వెలుగుచూసింది. ప్రపంచ దేశాధినేతల్లో మోస్ట్ పాపులర్ ఎవరంటే? 77 శాతం మోడీకి ఓటు వేశారు. మోడీకి దగ్గరలో ఎవరూ కూడా లేరు. అదీ మోడీ క్రేజు.. అందుకని మోడీని అమెరికా ప్రభుత్వం గుర్తించింది. అమెరికా కాంగ్రెస్ కూడా గౌరవించింది. అమెరికా ప్రభుత్వం స్టేట్ గెస్ట్ గా పిలిచింది.
మొత్తం ఇప్పటివరకూ అమెరికా కేవలం ముగ్గురు భారతీయ ప్రధానులు/రాష్ట్రపతులను మాత్రమే ఇలా పిలిచింది. 1963 జూన్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ను, నవంబర్ 2009లో డా. మన్మోహన్ సింగ్ ను.. 2023 జూన్ 23న మన భారత ప్రధాని నరేంద్రమోడీని గెస్ట్ గా పిలుస్తోంది. ఇజ్రాయిల్ ప్రధానులు అమెరికా కాంగ్రెస్ లో ఎక్కువగా మాట్లాడారు. అయితే రెండో దేశం నుంచి రెండో నాయకుడు అలా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది రేర్ రికార్డ్ గా చెప్పొచ్చు.
అమెరికా కాంగ్రెస్ కూడా రెండోసారి ప్రధాని మోడీని పిలిపించుకొని మాట్లాడుతోంది. ఏదైతే జాయింట్ స్టేట్ మెంట్ లో కీలక అంశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే భారత్ ను ఇప్పటివరకూ ఎవరూ విస్మరించలేని పరిస్థితి ఉంది.
అమెరికాతో ఈ ఒప్పందాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా ఇంకా ముందుకు వెళుతుంది. ప్రపంచ నాయకుడు మోడీ కోసం అటు ప్రభుత్వం, ఇటు ప్రవాస భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మోడీ పర్యటన విశేషాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..