Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు బ్రేక్ ఇచ్చినట్టో ఎవరికీ తెలియదు. చాలా మందికి దాని మీద చాలా సందేహాలున్నాయి. ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉంది. ప్రతీ క్షణం విలువైంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విస్తృతంగా తిరుగుతున్నారు. కానీ పవన్ మాత్రం వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. దీనికి కారణం ఏంటో తెలియడం లేదు.
పార్లమెంటరీ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఆర్గనైజేషన్ నిర్మాణం, రిసోర్సెస్, సమయం చూస్తే.. ఆర్గానిక్ గ్రోత్ కంటే ఇనార్గానిక్ గ్రోత్ మీద ఎక్కువ దృష్టిపెట్టినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే గ్యాప్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఇనార్గానిక్ గ్రోత్ మీదనే నమ్ముకున్నారు.
కొత్త నేతలు, సీనియర్లు రాకతో జనసేన బలోపేతం అవుతోంది. కొణతాల రామకృష్ణ లాంటి నేతలు కూడా జనసేన వైపు రావడం.. అంబటి రాయుడు లాంటి వారు రావడం చూస్తే.. ఇనార్గానిక్ గ్రోత్ వల్ల పవన్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది.. ముద్రగడ కూడా జనసేన వైపు రావడంతో పవన్ లో ధీమా వచ్చేసినట్టు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎందుకు బ్రేక్ ఇచ్చాడు? అనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.