Homeజాతీయ వార్తలుKCR- Early Elections: కేసీఆర్ ‘ముందస్తు ఎన్నికల’పై ఎందుకు వెనక్కి తగ్గాడు? ఆ మతలబేంటి?

KCR- Early Elections: కేసీఆర్ ‘ముందస్తు ఎన్నికల’పై ఎందుకు వెనక్కి తగ్గాడు? ఆ మతలబేంటి?

KCR- Early Elections: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరిగింది. గతంలో మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వాదనను సీఎం కేసీఆర్‌ స్వయంగా పలుసార్లు తోసిపుచ్చినప్పటికీ.. దీనిపై ఊహాగానాలు మాత్రం ఆగలేదు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ముందస్తుకు వెనుకడుగు వేస్తున్నారట. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్‌ ఎప్పుడైనా మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడొచ్చని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

KCR- Early Elections
KCR- Early Elections

-రెండేళ్లు ఎలాంటి ఎన్నికలు లేవు..
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థును ఏకిపారేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ గురించి ఆలోచించే నాయకుడు ఒక్క కేసీఆర్‌ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణలో మరో ఏడాది, రెండేళ్లపాటు ఎలాంటి ఎన్నికలు ఉండబోవంటూ కేటీఆర్‌ కామెంట్‌ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణకు వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్‌ అంతకంటే ముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు ముందస్తు ఎన్నికలకు వెళతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల టీపీసీసీ మాజీ చీఫ్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్‌ మాత్రం రాబోయే ఏడాది, రెండేళ్లపాటు తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు ఉండబోవంటూ ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ వెళ్లే అవకాశం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

Also Read: KGF Mother: తెలుగు హీరోలపై ‘కేజీఎఫ్ మదర్’ ఆసక్తికర కామెంట్స్..!

నిజానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే అంశంపై టీఆర్‌ఎస్‌ నేతల్లో కూడా పెద్దగా క్లారిటీ లేదు. బీజేపీ ఊపు బలంగా ఉన్న ఈ టైంలో ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం రెండేళ్ల అధికారం ఉంది. దాన్ని అనుభించకుండా ముందస్తుకు వెళితే.. ఒకవేళ ఓడితే ఉన్నరెండేళ్లు కూడా పొగొట్టుకున్న వాళ్లం అవుతామని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీపై వచ్చే రెండేళ్లలో వ్యతిరేకత వస్తుందని.. అప్పటివరకూ ఎదురుచూడడమే బెటర్ అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని కన్ఫమ్ అయ్యింది.

KCR- Early Elections
KCR- Early Elections

-కలవపెడుతున్న సర్వే రిపోర్టులు..
ఎన్నికలపై క్లారిటీ లేకపోయినా టీఆర్‌ఎస్‌ అధిష్టానం చేస్తున్న సర్వేలు మాత్రం ఎమ్మెల్యేలను, పార్టీ ముఖ్యనేతలను కలవరపెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మెజార్టీ నేతలకు మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదని టీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయ్యిందట… ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ డిసైడయ్యారని సమాచారం. ఇప్పుడప్పుడే తెలంగాణలో ఎన్నికలు లేవని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రస్తుతానికైతే ఊరట కలిగింది.కానీ రెండేళ్ల తర్వాత మాత్రం వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ టికెట్ల కోసం ప్రయత్నించాల్సిందే మరీ..

Also Read:AP Power Cuts: ఏపీలో విద్యుత్ సంక్షోభం.. పరిశ్రమలకు పవర్ హాలీడే పొడిగింపు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Rajasthan High Court: భారతదేశంలో న్యాయస్థానాల తీర్పులు విచిత్రంగా వింతగా ఉంటాయి. మన చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుని ఎంతో మంది శిక్ష నుంచి తప్పించుకుంటారు. వంద మంది హంతకులు తప్పించుకున్నఫర్వాలేదు. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనేది న్యాయ సిద్ధాంతం. మన చట్టంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుని నిందితులు తప్పించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ లా లో ఉన్న కొన్ని మార్గాలను తమకు దగ్గర దారిగా మలుచుకుంటున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ను ఇంటి మంచం కోడ్లలా మార్చుకుంటున్న సంగతి విధితమే. దీంతో న్యాయవ్యవస్థ అపఖ్యాతి పాలవుతోంది. […]

  2. […] KTR:  తెలంగాణలో రాజకీయ పార్టీల వైఖరులు మారుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా స్పందిస్తోంది. ఇప్పటికే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా వాటిని అధికార పార్టీ లెక్కలోకి తీసుకోవడం లేదు. కానీ అలవాటులో పొరపాటుగా ఏదో యాదృచ్చికమో వ్యూహాత్మకమో గానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ వారిని ఉద్దేశించి విమర్శలు చేయడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular