Children’s Day: బాల్యం అనేది ఒక మధురమైన అనుభూతి. దేవుడు కనిపించి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే… మళ్ళీ ఒకసారి నా బాల్యం తిరిగి ఇవ్వమని కోరుకుంటా అని ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడు. ఎందుకుంటే, బాల్యం అనేది మనిషి జీవితం లో గుర్తించుకో దగ్గ దశ. ఏ మనిషిని అయిన కదిలించి ఒక ప్రశ్న అడిగితే… మొట్ట మొదటగా చెప్పే విషయం నా చిన్నప్పుడు ఇలా, అలా అని మొదలుపెడతాడు. అలాంటి బాలలకు ఒక ప్రత్యకమైన రోజు ని కేటాయించి ప్రత్యకమయిన రోజు ని కేటాయించి బాలల దినోత్సవం గా జరుపుకుంటారు. అయితే ఈ బలాల దినాన్ని ఎందుకు జరుపుకుంటారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి అని తెల్సుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
మన భారత దేశంలో నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవం గా జరుపుకుంటారు. నవంబర్ 14 అనేది మన మాజీ భారతదేశ ప్రధానమంత్రి అయిన శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి పుట్టినరోజు సందర్బంగా జరుపుకుంటారు. జవహర్ లాల్ నెహ్రు గారు 1889 నవంబర్ 14న జన్మించారు.
శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారు మన స్వతంత్ర ఉద్యమం లో ఎంతో కీలకమయిన పాత్ర పోషించారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఈయన 1947 నుండి 1964 సంవత్సరం వరకు మన దేశానికి ప్రధానిగా వ్యవహరించారు.
నెహ్రు కి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన్ని ముద్దుగా చాచా అని పిలుచుకుంటారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తుకు పునాదులు అని గట్టిగా నమ్మేవాళ్ళు. ఈయన బాలల విద్యా హక్కు కోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. అయన చేసిన సేవలకు గుర్తు గాను, ఆయనకి పిల్లల మీద ఉండే ప్రేమకి చిహ్నంగా ప్రతి ఏటా నవంబరు 14 వ తేదీన ఆయిన పుట్టిన రోజు ని బాలల దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుంది.
ఆ రోజున దేశం లో ఉన్న అన్ని స్కూళ్ల లో బాలల దినోత్సవ వేడుకలు ఘనం గా జరుపుకుంటారు. అన్ని పాఠశాలలు వివిధ రకమైన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.