Rahul Gandhi : రాహుల్ గాంధీ యాత్రతో రాజకీయంగా నష్టమెవరికి?

రాహుల్ గాంధీ యాత్రతో రాజకీయంగా నష్టమెవరికి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 17, 2024 5:29 pm

Rahul Gandhi : రాహుల్ గాంధీ బస్సు యాత్ర ఎలా సాగుతోంది? ఈ యాత్ర ఉద్దేశం ఏంటి? సిద్ధాంతపరమైన పోరాటం అని రాహుల్ చెబుతున్నాడు. రాహుల్ గాంధీ పోటీపడుతుంది.. ఫైట్ చేస్తుంది బీజేపీతో కాదు.. ఇండియా కూటమిలోని భాగస్వాములతోటి.. బీజేపీకి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర లాస్ట్ టైం జరిపినట్టుగా ఈసారి జరుపుతున్నట్టు చెబుతున్నాడు. కానీ రాహుల్ బస్సు యాత్ర చూస్తే బీజేపీ రాష్ట్రాలు చాలా తక్కువగా ఉన్నాయి.

మణిపూర్ లో రాహుల్ యాత్ర మొదలుపెడుతున్నాడు. మణిపూర్ లో రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విడిపోయారు. మైతీలు, కుకీలుగా విడిపోయారు. ఎవరి చోట వారే ప్రచారంలో పాల్గొన్నారు. కలిసి యాత్ర చేయలేకపోయారు. ముందు రాహుల్ పార్టీని జోడో చేయాలని అందరూ విమర్శిస్తున్నారు.

ఈశాన్య భారతంలో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాంలలో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా చూపడం లేదు. ఈశాన్యంలో మోడీ చేసినంత అభివృద్ధి గత 70 ఏళ్లలో ఏ ప్రధాని చేయలేకపోయారు. మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ గాలి ఇక్కడ పనిచేయదు. మిగతా రాష్ట్రాలు చూస్తే రాహుల్ ఉద్దేశం ఏంటన్నది తెలుస్తుంది..

మిగతా రాష్ట్రాలు చూస్తే.. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో కాంగ్రెస్ 3 లేదా 4వ స్థానాల్లో ఉంది. చత్తీస్ ఘడ్ లో మాత్రమే 2వ స్థానంలో ఉంది.

రాహుల్ గాంధీ యాత్రతో రాజకీయంగా నష్టమెవరికి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.