Homeక్రీడలుIPL 2023 - GT : గుజరాత్ జట్టు సక్సెస్ క్రెడిట్ ఎవరిది..?

IPL 2023 – GT : గుజరాత్ జట్టు సక్సెస్ క్రెడిట్ ఎవరిది..?

IPL 2023 – GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. లీగ్ దశలో అద్భుత విజయాలను సాధించిన ఈ జట్టు టేబుల్ టాప్ లో స్థానాన్ని దక్కించుకొని ప్లే ఆఫ్ చేరింది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో అనూహ్యంగా ఆ జట్టు ఓటమిపాలైనప్పటికీ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో పట్టిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టును ఓడించింది. గుజరాత్ అద్భుత విజయాల వెనుక ఇద్దరు దాగి ఉన్నారని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎవరా ఇద్దరూ..? గుజరాత్ విజయాలను ఎలా నిర్దేశించారో తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత విజయాలతో ఫైనల్ వరకు చేరుకుంది. పటిష్టమైన దట్లపై కూడా గుజరాత్ ఐటమ్స్ గట్టు అలవాకగా విజయాలు నమోదు చేసింది. లీగ్ దశలో 14 మ్యాచుల్లో 10 విజయాలు నమోదు చేసి 20 పాయింట్లతో టేబుల్ టాప్ లో నిలిచింది గుజరాత్ జట్టు. నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే ఓటమి పాలైంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓటమిపాలైనప్పటికీ అనూహ్యంగా కోలుకుని రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో బలమైన ముంబై జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ లో అడుగుపెట్టిన మొదటి ఏడాది టోర్నీ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన ఈ జట్టు.. రెండో ఏడాది కూడా అదే విధమైన ప్రదర్శనతో అభిమానులను అలరిస్తోంది. అయితే గుజరాత్ జట్టు విజయంలో వెనుక ఇద్దరు కీలకమైన వ్యక్తుల పాత్ర దాగి ఉందన్నది పలువురు చెబుతున్న మాట.
గుజరాత్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు..
గుజరాత్ జట్టు విజయాలు వెనక కీలకమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారని భారత జట్టు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ జట్టు గొప్ప విజయాలు సాధించడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా ఒక పాత్ర పోషించారని ఆయన వెల్లడించారు. ఇంపాక్ట్ ప్లేయర్లను ఆ జట్టు సరిగ్గా వినియోగించుకుందని కుంబ్లే ప్రశంసించారు. కుంబ్లే చెప్పినట్లు గుజరాత్ విజయాల్లో వీరి పాత్ర కొట్టి పారేయలేనిది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా తీసుకున్న అనేక నిర్ణయాలు జట్టుకు విజయాలను సాధించి పెట్టాయి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యర్థి జట్టు ఆడుతున్న ఆటకు అనుగుణంగా మార్పులు చేస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. అదేవిధంగా జట్టు అవసరాలను, లోపాలను బయట ఉండి గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందిస్తూ ఆశీశ్ నెహ్రా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అద్భుతమైన ఆట తీరు కనబరిచిన హార్దిక్ పాండ్యా..
హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లకు ముకుతాడు వేయడంతోపాటు ఒక ఆటగాడిగాను అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా 134.85 స్ట్రైక్ రేటుతో 325 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉండగా, అత్యధిక 66 పరుగులు కావడం గమనార్హం. ఇక బౌలింగ్ విభాగంలోనూ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. 15 మ్యాచ్లో 24 ఓవర్ల బౌలింగ్ చేసిన పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో బౌలింగ్ చేస్తూ ఎంతగానో ఉపయోగపడ్డాడు.
స్టేడియం బయట ఉన్నా.. జట్టుకు కీలకంగా ఆశీశ్ నెహ్రా..
గుజరాత్ టైటాన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఆశీశ్ నెహ్రా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు బౌలర్లు అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముగ్గురు టాప్ లో ఉన్నారంటే ఆశీశ్ నెహ్రా ఏ స్థాయిలో కృషి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక జట్టు పై బౌలర్లు తేలిపోతుంటే.. లోపాలను గుర్తించి వెంటనే టీమ్ కెప్టెన్ కు చేరవేసేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్పు చేస్తూ జట్టు విజయాల సాధించడంలో కృషి చేస్తున్నాడు నెహ్రా. ముంబై ఇండియన్స్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లోనూ నెహ్రా ఇదే పని చేశాడు. సరైన సమయంలో మోహిత్ శర్మను బౌలింగ్ కు దించి మంచి స్పీడ్ మీద ఉన్న సూర్య కుమార్ యాదవ్ వికెట్ తీసేలా చేశాడు. సూర్య కుమార్ యాదవ్ ను మోహిత్ శర్మ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత ముంబై జట్టు కోలుకోలేకుండా పోయింది. ఇటువంటి విధంగా అనేక మ్యాచ్ ల్లో నెహ్రా తనదైన వ్యూహాలతో బౌలింగ్లో మార్పులు చేస్తూ గుజరాత్ జట్టు విజయాలను సాధించేలా చేస్తున్నాడు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version