Singareni Report : పదేళ్లలో బొందల గడ్డలే.. ఇదీ సింగరేణి ‘స్వేద’ పత్రం!

కొత్త గనుల కోసం సింగరేణి ముందడుగు వేయకపోతే మరో 20 సంవత్సరాలు తర్వాత సంస్థ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 26, 2023 12:20 pm
Follow us on

Singareni Report : రేపు సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. భారత రాష్ట్ర సమితి గనుక మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఉంటే సింగరేణి ప్రాంతంలో పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితంగా భారత రాష్ట్ర సమితి ఏలుబడిలో సింగరేణి లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? గులాబీ పెద్దలు సింగరేణి ఏ విధంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు? గతంలో కార్మికుల సంఖ్య ఎంత ఉంది? ప్రస్తుతం ఎంతకు తగ్గింది? విషయాలు తెరపైకి వస్తున్నాయి.

సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు లాభాల్లో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ లను ఉంచబోమని, గర్భగనులను ఏర్పాటు చేసి సింగరేణిలో ఉద్యోగాలు కల్పిస్తామని కెసిఆర్ పదేపదే ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి మరింత లాభాల బాటపడుతుందని కార్మికుల ఆశించారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థలు ఓసిపి ల సంఖ్య క్రమంగా తగ్గింది. కొత్త భూగర్భ గనులు ఏర్పడలేదు. పైగా తట్ట చెమ్మాస్ స్థానంలో కొత్తగా యాంత్రికరణ వచ్చేసింది. ఫలితంగా 2013_14 సంవత్సరంలో 61,778 గా ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతం 39,748 కి తగ్గిపోయింది. కొత్త కొలువులు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను పూర్తిగా విస్మరించారు.. పైగా కొత్త గనుల ప్రస్తావన ను మొత్తం పక్కన పెట్టింది. తోడు బొగ్గు బ్లాక్ లను కేంద్ర ప్రభుత్వం వేలంలో పెడుతుండడంతో సింగరేణి మనుగడపై ఒకింత నీళ్లు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు 56 భూగర్భ గనులు ఉండగా, వాటి సంఖ్య ఈరోజు 29 కి తగ్గింది. ఓపెన్ కాస్ట్లు 19 కి పెరగడంతో కార్మికుల సంఖ్య తగ్గిపోయింది.

ప్రస్తుతం సింగరేణిలో కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టమని ఆందోళన కార్మికుల్లో వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం పై సింగరేణి కార్మికులు ఆశలు పెంచుకున్నారు. బుధవారం జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నామని చెబుతున్నారు. సింగరేణి ఏరియాలో కొత్తగా భూగర్భంలో ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగరేణి ప్రాంతాల్లో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ లతోపాటు వంద పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ప్రతి కార్మికుడికి సొంత ఇంటి కల నిజం చేసేలా కొత్త ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బుధవారం జరిగే ఎన్నికల సందర్భంగా అన్ని సంఘాలు కార్మికులకు అనేక హామీలు. ప్రధానంగా పోటీ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ మధ్య నెలకొని ఉందని తెలుస్తోంది. కోల్బెల్ట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐఎన్టీయూసీ తరఫున ప్రచారం చేశారు. తాము గుర్తింపు సంఘంగా ఎన్నికైతే ఏం చేస్తామో కార్మికులకు వివరించారు. అయితే కార్మికులు ఎటువైపు ఉంటారు అనేది రేపు సాయంత్రం తేలిపోతుంది. విజయంపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ చాలా ధీమాగా ఉంది.. అంతేకాదు గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సింగరేణి ఏ విధంగా అప్పుల మయం చేసింది అనేది కార్మికులకు అర్థమయ్యేలాగా వివరించింది.

భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది. రమేపి సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అనే స్థాయికి దిజారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంకు బ్యాలెన్స్ 3540 కోట్లుగా ఉండేది. అయితే లాభాల్లో ఉన్న సంస్థ కాస్త ప్రస్తుతం 50,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దీనికి తోడు ట్రాన్స్ కో, జెన్కో సంస్థల నుంచి 27 వేల కోట్ల బకాయిలు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. పైగా ఆ సంస్థకు సిఎండిగా ఒకే అధికారి దీర్ఘకాలికంగా పనిచేయడం.. ఆయన గత ప్రభుత్వానికి వీర విధేయుడుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన నిర్వాకం వల్లే సింగరేణి అప్పుల్లో కూరుకుపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడగానే 15 అండర్ గ్రౌండ్ గనులు ఏర్పాటు చేసి.. కొత్తగా లక్ష ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత పదివేల కాలంలో 2018లో మణుగూరు ఏరియాలోని కొండాపూర్ లో మాత్రమే ఏర్పాటు చేశారు. అలాగే ఇందారం ఓసిపి, భూపాలపల్లి లో ఓసిపి_3 లను ఏర్పాటు చేశారు. కేవలం ఒక్క భూగర్భ గని, రెండు ఓపిపీలు మాత్రమే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. గడిచిన 10 సంవత్సరాలలో సింగరేణి కేవలం 4253 పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అండ్ మెకానిక్, డాక్టర్ పోస్టులు మాత్రమే భర్తీ చేసి చేతులు దులుపుకుంది. తెలంగాణ ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత పరివాహకంలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఒక విశ్లేషణ ప్రకారం ఈ ప్రాంతంలో 11 వేల మిలియన్ టన్నుల బొగ్గుని చేపలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు సింగిరెడ్డి 1600 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీసింది. ఇక సింగరేణి జియాలాజికల్ విభాగం లెక్కల ప్రకారం ఇంకా 1400 మిలియన్ టన్నుల బొగ్గునిక్షేపాలే ఉన్నాయని తెలుస్తోంది. వీటిని వెలికి తీసేందుకు మరో 25 సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంది. కోయగూడెం, ఓసీ_3, శ్రావణపల్లి ఓసిపి, సత్తుపల్లి వైసీపీకి ఇటీవల కేంద్రం వేలం వేసింది. మాత్రం వివిధ కారణాలు చెబుతూ ఇందులో పాల్గొన లేదు. ఈ మూడు గనుల్లో బొగ్గునిక్షేపాలు గుర్తింపు, ఇతర పనుల కోసం సింగరేణి 60 కోట్లు ఖర్చు చేసింది. పైగా 25 లక్షలు వెచ్చించి టెండర్ దరఖాస్తులు కూడా కొనుగోలు చేసింది. అయినప్పటికీ వేలంలో సింగిరెడ్డి పాల్గొనలేదు. దీంతో 300 మిలియన్ టన్నుల బొగ్గు సింగరేణికి దూరమైంది. కొత్త గనుల కోసం సింగరేణి ముందడుగు వేయకపోతే మరో 20 సంవత్సరాలు తర్వాత సంస్థ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉంది.