#WhatsAppDown : వాట్సాప్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. వాట్సాప్ లేనిదే పూటగడవని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగుల పని మొత్తం వాట్సాప్ ద్వారానే కావడంతో వారి పనులన్నీ ఆగిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక టెక్ ప్రపంచం, సామాన్యులు, వినియోగదారులు ఆరాలు తీస్తున్నారు.

వాట్సాప్ వచ్చాక కనెక్టివిటీ పెరిగింది. ఏ దేశంలో ఉన్నా వారితో డైరెక్ట్ వీడియో కాల్స్, ఆడియో, సందేశాలు, క్షేమ సమాచారాలు తెలుసుకునే వీలు కలిగింది. అంతేకాదు.. ఇప్పుడు ఇంటి పనుల నుంచి ఆఫీసు పనుల వరకూ అన్ని దాంట్లోనే..బంధాలు, సంబంధాలు, మీటింగ్ లు, కలుసుకోవడాలు, ఫోన్లో చాటింగ్ లు, వీడియోలు అన్నీ దాంతోనే.. అలాంటి వాట్సాప్ లేని మొబైల్ ను.. ఈ ప్రపంచాన్ని మనం ఊహించలేం. కానీ ఆ ఉపద్రవం రానేవచ్చింది.
https://twitter.com/imAmanDubey/status/1584806896707731459?s=20&t=G3csY0QuOl_5r0Amo1sV2w
ప్రపంచవ్యాప్తంగా ‘వాట్సాప్’ ఆగిపోయింది. వాట్సాప్ లేనిదే సగటు మనిషి జీవితం నడవని ఈ పరిస్థితుల్లో ఇది ఆగిపోవడంతో చాలా మంది పని కూడా ఆగిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోయింది. అన్ని కంపెనీలు, సంస్థల్లో వాట్సాప్ ద్వారానే పనులు సాగుతుంటాయి. మీడియాలోనూ వార్తలు చేరవేయడానికి వాట్సాప్ నే కీలకం. అలాంటి వాట్సాప్ ఆగిపోవడంతో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU
— Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. చాలా మంది యూజర్లు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ లు చేయలేకపోతున్నారు. పర్సనల్ గా కూడా మెసేజ్ లు వెళుతున్నా.. సింగిల్ టిక్ మాత్రమే వస్తుండడంతో ఏం జరుగుతుందో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. కొందరికి పర్సనల్ మెసేజ్ లు వెళ్లడం లేదు.
WhatsApp Engineer right now.#WhatsAppDown pic.twitter.com/aPmnZxl1RD
— Durgesh Pandey (@DurgeshPandeyIN) October 25, 2022
వాట్సాప్ పనిచేయడం లేదని తెలియగానే వినియోగదారులు తమ క్రియేటివిటీని అంతా బయటకు తీశారు. నెటిజన్లు ఫన్నీ మీమ్స్ తో ఇప్పుడు ట్విట్టర్ లో మీమ్స్ తో చెలరేగిపోతున్నారు. వాట్సాప్ బంద్ అయ్యిందని.. ఇక ట్విట్టర్ యే దిక్కు అంటూ అందరూ అటువైపు పరుగులు పెడుతున్న నవ్వులు పూయించే మీమ్స్ రూపొందిస్తున్నారు.వాట్సాప్ కు సూర్యగ్రహణం రోజే గ్రహణం పట్టిందంటూ మరొకరు మీమ్స్ చేస్తున్నారు.ఇక వాట్సాప్ కు స్పందించలేదని ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ప్రియురాలి స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతోంది. ఇలా వాట్సాప్ ఆగిపోవడంతో ఎన్నో ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నాయి. టెక్నికల్ కారణాలతో వాట్సాప్ ఆగిపోయింది. అయితే వాట్సాప్ పని అయిపోయింది.. ఇక పదండ్రా ట్విట్టర్ కు అంటూ మీమ్స్, ట్వీట్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది.
https://twitter.com/stonepari307/status/1584824537547706368?s=20&t=G3csY0QuOl_5r0Amo1sV2w
https://twitter.com/_EFEZINO_/status/1584824891198644228?s=20&t=G3csY0QuOl_5r0Amo1sV2w
#WhatsAppDown
soon after realising the crash.. pic.twitter.com/P4Sad1f3t0— Ankita Roy Choudhury (@thetrippinbug) October 25, 2022