https://oktelugu.com/

వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఆటోమేటిక్ గా ఫోటోలు డిలేట్..?

మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నెలలో కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన వల్ల వాట్సాప్ వివాదంలో చిక్కుకుంది. అయితే ఆ తరువాత ప్రైవసీ పాలసీ నిర్ణయాన్ని వాయిదా వేసిన వాట్సాప్ యూజర్లను నిలుపుకోవాలనే ఉద్దేశంతో కొత్త ఫీచర్లను అమలులోకి తెచ్చింది. ఇతర మెసేజింగ్ యాప్ లతో పోలిస్తే వేగంగా యూజర్లకు ప్రయోజనం చేకూర్చే ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 4, 2021 / 11:45 AM IST
    Follow us on

    మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నెలలో కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన వల్ల వాట్సాప్ వివాదంలో చిక్కుకుంది. అయితే ఆ తరువాత ప్రైవసీ పాలసీ నిర్ణయాన్ని వాయిదా వేసిన వాట్సాప్ యూజర్లను నిలుపుకోవాలనే ఉద్దేశంతో కొత్త ఫీచర్లను అమలులోకి తెచ్చింది. ఇతర మెసేజింగ్ యాప్ లతో పోలిస్తే వేగంగా యూజర్లకు ప్రయోజనం చేకూర్చే ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.

    Also Read: వంటలకు ఏ నూనె వాడితే మంచిదో తెలుసా..?

    కొన్ని రోజుల క్రితం వాట్సాప్ మ్యూట్ వీడియో ఫీచర్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ యూజర్లను ఆకట్టుకుంది. ఇప్పటికే వాట్సాప్ యాప్ లో డిస్‌అపియరింగ్‌‌ మెసేజెస్‌ ఫీచర్ ఉండగా మీడియా డిస్‌అపియరింగ్ అనే కొత్త ఫీచర్ ను వాట్సాప్ యాప్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అవతలి వ్యక్తులు ఫొటోలు/వీడియోలు చూడగానే ఆ ఫోటోలు, వీడియోలు డిలేట్ అయిపోతాయి.

    Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1500 కడితే రూ.లక్ష మీ సొంతం..?

    ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలని అనుకునే వాళ్లు ఫోటో లేదా వీడియో డిలేట్ చేయడానికి వాటిని షేర్ చేసే ముందు యాడ్‌ కాప్షన్‌ అనే బాక్స్‌ పక్కన ఉండే గడియారం సింబల్‌ ను టచ్ చేసి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న వారికి ఫోటో, వీడియో చూసిన వెంటనే డిలేట్ అవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ప్రస్తుతం కొంతమంది వాట్సాప్ యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని మరికొన్ని రోజుల్లో వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.