
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’పై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకొని బిజినెస్ చేసే పనిలో పడ్డారు చిరంజీవి. స్వయంగా నిర్మాతగా ఉన్న రామ్ చరణ్ ఆచార్య కోసం భారీ బడ్జెట్ నే పెట్టారు. అంతేమొత్తంలో రాబట్టుకోవడానికి చిరంజీవి, రామ్ చరణ్ పెద్ద ప్రణాళికే వేస్తున్నారు. దాదాపు 150 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మిస్తుండడంతో పక్కా ప్లాన్ తో దీని హక్కలను విక్రయిస్తున్నారు. అయితే తాజాగా శాటిలైట్ హక్కులకు చేసిన కోట్స్ పై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు భారీగానే ఆశ పెట్టుకున్నారు. అటు ఫేమస్ డైరెక్టర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి అయినందును సినిమాపై అంచనాలు ఎక్కవే ఉన్నాయి. దీంతో ఆ రేంజ్లో సినిమా తీయడానికి కూడా స్వయంగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని రోల్స్ లో రామ్ చరణ్ నటించాడు. దీంతో సినిమాపై హైప్ క్రీయేట్ అయింది.
ఈ సినిమా టీజర్ తో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్లలో వ్యూస్ పెరగడంతో సినిమా కోసం జనం ఎదురుచూస్తున్నట్లు చిత్ర బృందం ఎక్స్పెక్ట్ చేసింది. దీంతో సాధ్యమైనంత మేరకు ఎక్కవ కోట్స్ చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా శాటిలైట్ హక్కుల కోసం ముందుగా రూ.80 కోట్లు డిసైడ్ చేశారు. అయితే అంత మొత్తానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రూ.50 కోట్లు తగ్గించారు. అయితే దీనిపై జీతెలుగు, సన్ గ్రూప్ చర్చలు జరుపుతోంది.
శాటిలై్ వరకే ఇంత మొత్తంలో ఉంటే వెండితెర కోసం ఎంత బడ్జెట్ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఖైదీ నంబ్ 150 నుంచి మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆచార్య ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో మరి థియేర్లకొచ్చేసరికి ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.