Hanuman Jayanthi: హనుమాన్ జయంతినాడు ఏం చేయాలి? ఎలా కొలవాలి? ప్రత్యేకతలివీ

ఈ రోజు సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని ఆంజనేయుడికి పూయాలి. హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. రామలక్ష్మణుల కథ వినాలి. ఇలా చేస్తే మనకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల మనకు జీవితంలో కష్టాలు రాకుండా పోతాయి. ఇలా ఆంజనేయుడిని పూజిస్తే మనకు సకల శుభాలు వస్తాయి.

Written By: Srinivas, Updated On : May 14, 2023 12:44 pm
Follow us on

Hanuman Jayanthi: నేడు హనుమాన్ జయంతి. ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతులు వస్తాయి. ఒకటి చైత్ర మాసంలో మరొకటి వైశాఖ మాసంలో వస్తాయి. అయితే వైశాఖ మాసంలో వచ్చే జయంతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. హనుమంతుడి పేరు సుందరుడు. అంజలిదేవి పుత్రుడు కావడంతో ఆంజనేయుడిగా పిలుస్తారు. కేసరి నందనుడు కావడంతో కేసరి నందనుడు అని కూడా పిలుస్తారు.

హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో రావడానికి ఓ కారణం ఉంది. రామాయణంలో ఆంజనేయుడు ఆకలి వేస్తుందని సూర్యుడిని మింగేందుకు వెళతాడు. అప్పుడు ఎవరు చెప్పినా వినడు. దీంతో ఆంజనేయుడిని బాణంతో కొడతారు. అప్పుడు కిందపడి ఆంజనేయుడు ఆకారం మారిపోతుందట. అందుకే ఈ రోజు కూడా హనుమాన్ జయంతిని నిర్వహిస్తుంటారు.

భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. ఉపవాసం ఉండి ఎంతో భక్తితో ఉంటారు. నేలపైనే నిద్రిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఇలా ఆంజనేయుడిని కొలవడం ఏడాదిలో అన్ని రోజులు చేసినా ఈ రోజు ప్రత్యేకంగా చేస్తుంటారు. మనలో భయాన్ని పోగొట్టే దేవుడికి హనుమంతుడికి పేరు. అందుకే దెయ్యాలు, భూతాలను పోగొట్టేది ఆంజనేయుడే.

హనుమంతుడిని చిరంజీవిగా భావిస్తారు. ఈ రోజు సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని ఆంజనేయుడికి పూయాలి. హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. రామలక్ష్మణుల కథ వినాలి. ఇలా చేస్తే మనకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల మనకు జీవితంలో కష్టాలు రాకుండా పోతాయి. ఇలా ఆంజనేయుడిని పూజిస్తే మనకు సకల శుభాలు వస్తాయి.

హనుమాన్ జయంతిని నేడు నిర్వహిస్తున్నారు. కొండగట్టు జనారణ్యంగా మారుతుంది. దేవుడిని సందర్శించి భక్తిశ్రద్ధలతో మొక్కుతారు. పూజలు చేసి తన చూపు మనపై పడాలని కోరుకుంటారు. ఈనేపథ్యంలో హనుమంతుడిని కొలవడం మంచిది. హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మంది నియమ నిష్టలతో పూజలు చేస్తున్నారు.