JP Nadda : బీజేపీ అధ్యక్షుడు నడ్డా రామోజీ రావు, రాధాకృష్ణలను కలవటం దేనికి సంకేతం?

పవన్ ఎలాగైతే జనసేనను పొత్తుకు సిద్ధం చేస్తూ ఉన్నాడో.. టీడీపీ కూడా జనసేనకు అలాంటి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ సమన్వయం చేయాలి. టీడీపీ మీడియా కూడా ఈ పొత్తును అంగీకరించాలి.

Written By: NARESH, Updated On : October 7, 2023 3:23 pm

JP Nadda : ఆంధ్ర రాజకీయాలు ఎలా మారుతున్నాయో మనం చూస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశంతో సమన్వయం చేసే కమిటీని ప్రకటించారు. ఇరు పార్టీలు కూర్చొని చర్చించుకొని ఈ పొత్తును ఎలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వారి ఆలోచన కావచ్చు. ఏం అంశాలు చర్చకు రావాలన్నది చూసుకోవాలి.

ఈ సమన్వయ కమిటీలో చర్చించాల్సిన మొదటి విషయం ఏంటంటే.. ‘పవన్ పదే పదే పొత్తుపై టీడీపీతో వెళ్లడం గురించి చెబుతూ వస్తున్నాడు. ఇలాంటి చొరవ టీడీపీ నుంచి రావడం లేదు. వారు స్పందించడం లేదు. పవన్ తో పొత్తుపై టీడీపీ నేతలు కానీ.. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈరోజుకి దారుణమైన పోస్టింగులు వస్తున్నాయి. ఏబీఎన్ రాధాకృష్ణ అయితే పవన్ పై దారుణ కామెంట్స్ చేస్తున్నారు. అధికారికంగా ఒకటి.. అనధికారికంగా మరొకటి ఉండకూడదు.

పవన్ ఎలాగైతే జనసేనను పొత్తుకు సిద్ధం చేస్తూ ఉన్నాడో.. టీడీపీ కూడా జనసేనకు అలాంటి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ సమన్వయం చేయాలి. టీడీపీ మీడియా కూడా ఈ పొత్తును అంగీకరించాలి.

బీజేపీ అధ్యక్షుడు నడ్డా రామోజీ రావు, రాధాకృష్ణలను కలవటం దేనికి సంకేతం? అనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.