https://oktelugu.com/

7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

శనివారం సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు.మనం ఏదైనా కోరికను కోరుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతమాచరిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ శనివార వ్రతాన్ని ఏవిధంగా ఆచరించాలో ఇక్కడ తెలుసుకుందాం.. Also Read: ముక్కోటి ఏకాదశి రోజు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 26, 2020 11:01 am
    Follow us on

    Venkateswara Swamy

    శనివారం సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు.మనం ఏదైనా కోరికను కోరుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతమాచరిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ శనివార వ్రతాన్ని ఏవిధంగా ఆచరించాలో ఇక్కడ తెలుసుకుందాం..

    Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణు భగవానుని ఎందుకు పూజిస్తారో తెలుసా?

    ముందుగా శనివారం వేకువ జామున స్నానాలు ఆచరించి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణలతో పూజించాలి. ఆ తరువాత బియ్యపు పిండి, పాలు,అరటి పండు ముక్కలు వేసి ముద్దగా కలుపుకున్న పిండిని తర్వాత ఒక ప్రమిదల తయారు చేసుకోవాలి. ఈ బియ్యపు పిండి ప్రమిదలో ఏడు వత్తులను వేసి అందులో నువ్వుల నూనె లేదా నెయ్యిని వేసి శనివారం ఉదయం తులసికోట ముందు దీపారాధన చేయాలి.

    Also Read: కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది!

    అంతే కాకుండా శనివారం సాయంత్రం ఇదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు దీపారాధన చేయాలి.ఈ విధంగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి మనల్ని వెంటాడుతున్న శని బాధలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా నియమనిష్టలతో 7 శనివారాలు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం