Sandeep Reddy Vanga: నాగార్జున కెరీర్ నాశనం కావడానికి.. సందీప్ రెడ్డి వంగకు సంబంధమేంటి? సంచలన నిజం వెలుగులోకి..

అప్పట్లో ఓ సినిమా చేసిన తర్వాత నాగార్జున సినీ కెరీర్ పూర్తిగా డౌన్ ఫాలో అయిందట. అయితే ఈ సినిమా చేసే కంటే ముందు నాగార్జున సినీ కెరీర్ చాలా బాగుండేదట.

Written By: Suresh, Updated On : November 29, 2023 12:48 pm

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga: అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈయన నటించే సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. అంతే కాదు టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించిన కింగ్ ఇప్పటికీ కూడా మన్మథుడిగానే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ మధ్య మాత్రం ఈయన సినీ కెరీర్ లో పెద్ద హిట్ లు ఏ మాత్రం లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ మధ్య నాగార్జున నటించిన ది గోస్ట్ వంటి సినిమాలు పెద్దగా గుర్తింపును సంపాదించి పెట్టలేదు.

అయితే అప్పట్లో ఓ సినిమా చేసిన తర్వాత నాగార్జున సినీ కెరీర్ పూర్తిగా డౌన్ ఫాలో అయిందట. అయితే ఈ సినిమా చేసే కంటే ముందు నాగార్జున సినీ కెరీర్ చాలా బాగుండేదట. కానీ ఎప్పుడైతే ఈ సినిమా చేశారో అప్పటి నుంచి ఈయన సినీ కెరీర్ పూర్తిగా డౌన్ ఫాలో అయినట్టు తెలుస్తుంది. ఇక నాగార్జున చేసిన ఆ సినిమా ఏదో కాదు కేడి. కిరణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున మమతా మోహన్ దాస్ హీరోహీరోయిన్ లుగా నటించారు. ముందుగా సినిమాపై మంచి అంచనాలు ఉండేవి. కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నుంచి నెగటివ్ టాక్ ను సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా చేసే కంటే ముందు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా.. దర్శకుడు, కథతో సంబంధం లేకుండా థియేటర్లలో దద్దరిల్లిపోయేవి. కానీ ఎప్పుడైతే కేడి సినిమా చేశారో అప్పటి నుంచి ఈయన సినీ కెరీర్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అయితే కేడి సినిమా దర్శకత్వం కూడా బాగలేదు అనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న సందీప్ వంగ కేడీ సినిమాకు డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట. కిరణ్ కుమార్ లేని చాలా సమయాల్లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేశారట.

కేడి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రమే కాదు చిన్న పాత్రను కూడా చేశారు సందీప్. ఇక పెద్దగా అనుభవం లేకుండా నాగార్జున సినిమాకు సందీప్ డైరెక్షన్ వహించడం వల్లనే ఈ సినిమా ఫ్లాప్ ను మూటగట్టుకుందని టాక్. అలా ఈ ఒక్క సినిమాతో నాగార్జున సినీ కెరీర్ తలకిందులుగా మారింది.