Pilot Rohith Reddy- ABN RK: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తర్వాత ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కేసీఆర్ అండర్ లో ఉన్నారు.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార కూడా కేసీఆర్ వారిని వెంట తీసుకెళ్లాడు.. అత్యంత భద్రత మధ్య కొద్ది రోజులపాటు ఆ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లోనే ఉన్నారు.. మునుగోడు ఫలితాల తర్వాత వారికి ప్రగతి భవన్ చెర నుంచి విముక్తి లభించింది.. అయితే వారిలో ఎవరు కూడా మీడియా ముందుకు రావడం లేదు.. అయితే లొసుగులను పట్టడంలో దిట్ట అయిన వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే… తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేశాడు.. ఈయన మరెవరో కాదు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు కర్త, కర్మ, క్రియ. ఇక ఆదివారం ప్రసారం కాబోయే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ప్రోమో విడుదలైంది.. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డిని పలు ప్రశ్నలు వేసి వాటి ద్వారా రాధాకృష్ణ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశాడు.

కారు డిక్కీల్లో డబ్బులు పెట్టారు
రోహిత్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఖర్చులకోసం కాంగ్రెస్ నాయకులు కారు డిక్కీల్లో డబ్బులు పెట్టారు.. ఈ విషయం ఇన్నాళ్లు ఎవరికీ తెలియదు.. కానీ రాధాకృష్ణ ఈ విషయాన్ని రోహిత్ రెడ్డి నోటితోనే చెప్పించాడు.. అంతేకాదు భారత రాష్ట్ర సమితి బిజెపికి ప్రత్యామ్నాయం కాదని ఆర్కే కుండ బద్దలు కొట్టాడు. దీనికి రోహిత్ రెడ్డి కూడా అంగీకరించాడు.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అడిగిన ప్రశ్నలో కూడా ఆర్కే పలు ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టాడు.. రాష్ట్రంలో ప్రజలు మొత్తం సంతోషంగా ఉన్నారని రోహిత్ రెడ్డి చెప్పగా… దానికి ఆర్కే ఒక నవ్వునవ్వి రోహిత్ రెడ్డిని తూర్పారపట్టాడు.. ప్రజలు అంత సంతోషంగా ఉంటే పదివేల మెజార్టీ మాత్రమే ఎలా వస్తుందని రోహిత్ రెడ్డిని.. దీనికి రోహిత్ రెడ్డి బిజెపి వాళ్లు డబ్బు పంచారని చెప్పగా… మీరు అంతకంటే ఎక్కువే పంచారు.. ప్రూఫ్స్ ఉన్నాయని ఆర్కే వాదించాడు.. దీంతో రోహిత్ రెడ్డి సైలెంట్ అయ్యాడు.. ఇవే కాదు కాళ్ల పారాణి ఆరక ముందే అన్న సామెత తీరుగా భారత రాష్ట్ర సమితిలోకి ఎందుకు వెళ్లారు అని ఆర్కే అడిగితే… సమాధానం చెప్పలేక రోహిత్ రెడ్డి బిక్క మొహం వేశాడు. ఇవే కాదు ఇంకా చాలా ప్రశ్నలకు రోహిత్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు.. ప్రోమో నే ఇంత హాట్ హాట్ గా ఉంటే… ఇక ఇంటర్వ్యూ ఎలా సాగిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి రాధాకృష్ణ పైలెట్ ను ఇరుకున పెట్టేందుకు భలే స్కెచ్ వేశాడు.
