ట్రెండ్ ను బట్టి ఫ్యాషన్ మారడమే కాదు.. యుద్ధం కూడా మారుతుంది తెలుసా? వార్ పద్ధతులు కూడా మారిపోతాయి తెలుసా? కాకపోతే.. ఫ్యాషన్ ట్రెండ్ అనేది వీక్లీ వన్స్ మారొచ్చు! ఇది యుద్ధం కదా.. దశాబ్దాలు పడుతుంది! ఇంతకీ.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎంటంటే.. డ్రోన్ వార్! తుపాకులతో సైనికులు చెట్లమాటున.. పుట్టల చాటున దాక్కొని ప్రత్యర్థిని వేటాడే పద్ధతులు పాతబడిపోయాయి. టార్గెట్ ను ఫైండ్ చేయడం.. డ్రోన్ లాంఛ్ చేయడమే ఇప్పుడు నడుస్తున్న నయా వార్. మరి, ఇందులో ఇండియా పవర్ ఎంత? ప్రత్యర్థుల సత్తా ఎంత? సరిహద్దులో చైనాతో కయ్యం కొనసాగుతున్న వేళ.. డ్రోన్ వార్ ప్రాధాన్యత సంతరించుకుంది.
లద్దాఖ్ లో బలగాలను వెనక్కి తీసుకోవాలని రెండు దేశాలూ అంగీకరానికి వచ్చాయి. కానీ.. ఎవరి జాగ్రత్తలో వారు ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్ ఆయుధ సంపత్తి గురించి ఆలోచిస్తోంది. అమ్ముల పొదిలో పదునైన అస్త్రాలను చేర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే డ్రోన్ శక్తిని పెంపొందించుకోవాలని సైన్యం చూస్తోంది.
ఈ క్రమంలోనే జరిగిన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల (క్వాడ్) శిఖరాగ్ర సదస్సు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చైనా కట్టడి గురించిన చర్చ కూడా నడిచిందని సమాచారం. సరిహద్దులో డ్రాగన్ ను నిలువరించాలంటే.. అమెరికాతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Also Read: అంగారక గ్రహం నీటి కుండ.. ఎవరు ఖాళీ చేశారంటే?
ఈ క్రమంలోనే అమెరికా నుంచి కాంబాట్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల 19-21 తేదీల్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె.ఆస్టిన్ భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయాలు కూడా జరగవచ్చని అంచనా వేస్తున్నారు. కాంబాట్ డ్రోను యుద్ధ రంగంలో అద్వితీయమైన ప్రతిభ చూపుతున్నాయి. దీంతో.. వీటిని ప్రస్తుతం కొనుగోలు చేసి, ఆ తర్వాత దేశీయంగా తయారు చేయాలనే ఆలోచనలో ఉంది భారత్.
Also Read: శోభనంః మూడు రోజులు ఒకే గదిలో.. కానీ అది చేయొద్దు!
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడానికి మొత్తం 10 డ్రోన్లు కొనాలని చూస్తోంది. ఈ డ్రోన్ 45 వేల అడుగుల ఎత్తులో 35 గంటలపాటు ఆకాశంలోనే ఉండగల సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. కాల్బానికి కూడా మరో పది అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇజ్రాయిల్ నుంచి నాలుగు హెరాన్ నిఘా డ్రోన్లను మూడేళ్లపాటు లీజుకు తీసుకోవడానికి కూడా జనవరిలో ఒప్పందం కుదిరింది. ఈ డ్రోన్ల ద్వారా సరిహద్దులో సైన్యాన్ని ఉపయోగించకుండానే.. చైనాకు చుక్కలు చూపించొచ్చని అంటున్నారు. మరి, ఇవి ఎప్పుడు భారత్ సైన్యంలో చేరతాయో చూడాలి.