Cobra Movie Review: నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు
దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు
నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

చియాన్ విక్రమ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఈ రోజు రిలీజ్ అయిన కోబ్రా చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం రండి.
కథ:
మది (విక్రమ్) – ఖదీర్ (మరో విక్రమ్) ఇద్దరు అన్నదమ్ములు. అయితే, చిన్నతనం నుంచి ఖదీర్ మానసిక సమస్యలతో బాధ పడుతూ ఉంటాడు. దీనికి తోడు వీరి జీవితాల్లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా ఇద్దరూ మది పేరుతోనే ఒక్కరిగా బతుకుతూ ఉంటారు. అయితే, పెరిగి పెద్దయ్యాక మది మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇంటర్ నేషనల్ రేంజ్ లో మది కొన్ని హత్యలు చేస్తాడు. మరో వైపు భావన (శ్రీనిధి శెట్టి) మదిని ప్రేమిస్తూ ఉంటుంది. తనను పెళ్లి చేసుకోమని మదిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఖదీర్ (మరో విక్రమ్), మది పై పగ బట్టి అతన్ని అంతం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ ఖదీర్ ఎవరు ?, ఎందుకు మది పై పగ బట్టాడు ?, వీరి మధ్య జరిగిన కథ ఏమిటి ?, చివరకు మది కథ ఎలా టర్న్ అయ్యింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు.
అసలు విక్రమ్ లాంటి హీరోను పెట్టుకుని ఇలాంటి సిల్లీ డ్రామాను రాసుకోవడంలోనే ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఫెయిల్ అయ్యాడు. అయినా కథలోకి తీసుకెళ్లెందుకు మంచి సీన్స్ చూపించాలి.
కానీ అజయ్ జ్ఞానముత్తు మాత్రం అనవసరమైన ట్రాక్స్ చూపిస్తూ పోయాడు. ఇక విక్రమ్ – శ్రీనిధి శెట్టి మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బాగాలేదు. అయితే ఇంటర్వెల్ యాక్షన్ అండ్ ఎమోషన్ తో కథ ఊపందుకుంది అనుకుంటే.. అనవసరమైన సీన్స్ తో మళ్ళీ సినిమాని బోరింగ్ ప్లే సాగదీశారు. పైగా మృణాళిని రవితో సాగిన లవ్ సీన్స్ లో ఎక్కడా ఫీల్ లేదు.

అలాగే ఎమోషన్ కూడా లేదు. కానీ, ఇర్ఫాన్ పఠాన్ క్యారెక్టర్ మాత్రం బాగుంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా అద్భుతంగా నటించాడు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో విక్రమ్ – ఇర్ఫాన్ పఠాన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో చాలా సహజంగా నటించారు. ఇక మియా జార్జ్, కేఎస్ రవికుమార్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
విక్రమ్ నటన,
కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్,
సినిమాలో మెయిన్ పాయింట్,
మైనస్ పాయింట్స్ :
ఓవర్ బిల్డప్ సీన్స్,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
రెగ్యులర్ స్టోరీ,
బోరింగ్ స్క్రీన్ ప్లే,
తీర్పు :
సస్పెన్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ కోబ్రాలో కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే విక్రమ్ నటన బాగుంది. కాకపోతే, నాసిరకమైన సీన్స్ తో సినిమా బోర్ కొడుతుంది. అయితే, కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ పర్వాలేదు. ఓవరాల్ గా కోబ్రా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
రేటింగ్ : 2.,25 / 5 ,
[…] Also Read: Cobra Movie Review: రివ్యూ : కోబ్రా […]