Homeఆంధ్రప్రదేశ్‌YCP- Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన వైసీపీ..

YCP- Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన వైసీపీ..

YCP- Congress: దేశవ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా భారీ ప్లాన్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 377 సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఇందులో ఏపీ నుంచి వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ ఒంటరిపోరునే నమ్ముకుంటున్న వైసీపీ ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది.

YCP- Congress
YCP- Congress

-కాంగ్రెస్‌–వైసీపీ పొత్తు
ఏపీ విభజనతో తెలుగు రాష్ట్రాల్లో పరువు పొగొట్టుకుని దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విభజన తర్వాత తాము జీరోగా మారిన ఏపీలో తిరిగి ఉనికి చాటుకునేందుకు అధికార వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రశాంత్‌ కిశోర్‌ ఆ పార్టీకి సూచించారు. దీంతో ఏపీలో కాంగ్రెస్‌–వైసీపీ పొత్తు పొడుస్తుందా అన్న చర్చ మొదలైంది.

Also Read: CM KCR: ప్రస్తుత టీంతోనే ఎన్నికలకు వెళితే కేసీఆర్ విజయం సాధిస్తారా?

2019 ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్‌ పార్టీ తనకు ద్రోహం చేసిందంటూ దూరం పెట్టిన వైసీపీ అధినేత జగన్‌.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ పార్టీని క్షమించేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో యూపీఏలోకి వెళ్లేందుకు కూడా దారులు తెరిచి ఉంచుకున్నారు. ఇప్పుడు అదే అంశం మళ్లీ తెరపైకి వస్తోంది.

-విజయసాయిరెడ్డి క్లారిటీ
ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీకి తమ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకి వైసీపీ మద్దతిస్తుందంటూ తమ పార్టీ మనసులో మాట బయటపెట్టేశారు. అంతే కాదు ఇది ముఖ్యమంత్రి జగన్‌ మాట కూడా అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైసీపీ అవసరాన్ని బట్టి దారులు తెరిచి ఉంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

YCP- Congress
YCP- Congress

-పీకే తమ వ్యూహకర్త అయినా
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో గెలిచేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సాయం తీసుకున్న వైసీపీ ఇప్పుడు అదే పీకే కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైనా సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే వారికే వైసీపీ మద్దతుగా ఉంటుందంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో పీకే తమకు వ్యూహకర్తగా ఉన్నా, లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

-పదవుల్లో కోతపై మౌనం వీడారు..
తాజాగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన పార్టీ పదవుల్లో విజయసాయిరెడ్డికి భారీగా కోత పడింది. ముఖ్యంగా గతంలో ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఆయన్ను అధిష్టానం.. ఇప్పుడు పార్టీ అనుబంధ సంఘాలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పరిమితం చేసింది. దీనిపై స్పందించిన సాయిరెడ్డి.. తాను అనేక పదవులు నిర్వహించానని, అయితే పార్టీ ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తానని ప్రకటించారు. అలాగే తనకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి అని కోరుకోను, ఆడగను కూడా అని వెల్లడించారు.

Also Read:Wanted Lease Farmer: పొలం కౌలుకు ఇవ్వబడును ఆసక్తికరంగా వెలసిన పోస్టర్ ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version