Varuntej – Lavanya Marriage : కొత్త జంట వరుణ్-లావణ్యతో మెగా హీరోలు… ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో

అటు రాజకీయంగా ఇటు సినిమా షూటింగ్స్ పరంగా ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుణ్ పెళ్లి కోసం ఆయన షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

Written By: NARESH, Updated On : November 2, 2023 9:42 am
Follow us on

Varuntej – Lavanya Marriage : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్ వివాహం ఘనంగా ముగిసింది. హీరోయిన్ లావణ్యను చాలా కాలంగా ప్రేమిస్తున్న వరుణ్ ఆమెను భార్యగా చేసుకున్నారు. వీరి పెళ్ళికి ఇటలీ దేశం వేదికైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా ప్లాన్ చేశారు. ఓ వారం రోజుల క్రితమే వధూవరులు, కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు. సోమవారం నుండి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో సూట్ లో వరుణ్, ఫ్రాక్ లో లావణ్య మెస్మరైజ్ చేశారు.

పార్టీ కల్చర్ కి తగ్గట్లు మెగా హీరోలు కూడా సూట్స్ లో హాజరయ్యారు. ఇక మంగళవారం హల్దీ వేడుక జరిగింది. వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంటు ధరించారు. లావణ్య పసుపు రంగు లెహంగాలో మెరిసింది. బుధవారం పెళ్లి ముహూర్తం. రాత్రి 7:18 నిమిషాలకు వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య మెడలో మూడు ముళ్ళు వేశాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో లావణ్య-వరుణ్ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

పెళ్లి అనంతరం మెగా హీరోలందరితో కొత్త జంట ఒక ఫోటో దిగారు. లావణ్య-వరుణ్ క్రింద కూర్చొని ఉండగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వారి వెనుక నిల్చొని ఫోజిచ్చారు. వీరిలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా డ్రెస్ చేసుకున్నారు. అందరూ మ్యారేజ్ డ్రెస్ కోడైన ట్రెడిషనల్ వెర్ ధరించారు. పవన్ కళ్యాణ్ మాత్రం టీషర్ట్, ప్యాంటు ధరించారు.

వధూవరులతో మెగా హీరోలందరూ కలిసి దిగిన ఈ ఫోటో నెటిజెన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంది. చెప్పాలంటే ఈ ఒక్క స్నాప్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. వీరిలో పవన్ కళ్యాణ్ చాలా బిజీ. అటు రాజకీయంగా ఇటు సినిమా షూటింగ్స్ పరంగా ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుణ్ పెళ్లి కోసం ఆయన షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.