Ghani Movie Review: రివ్యూ : గని :
రేటింగ్ 2.5
నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్ ఎస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ బాక్సింగ్ యాక్షన్ డ్రామా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం..
Also Read: Acharya Trailer: ఆచార్య ట్రైలర్ అప్పుడే… మెయిన్ హైలైట్స్ ఇవే
కథ :
గని (వరుణ్ తేజ్) తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) నేషనల్ బాక్సర్. ఒక బాక్సర్ గా కంటే.. బాక్సింగ్ గెలవాలని కలలు కన్న ఒక అన్ సన్ హీరో. అయితే ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు) చేసిన ద్రోహానికి అతని లైఫ్ నాశనం అవుతుంది. దాంతో.. ‘గని తల్లి’ మాధురి (నదియా) లైఫ్ లో ఇక బాక్సింగ్ జోలికి వెళ్లకూడదు అని గని దగ్గర మాట తీసుకుంటుంది. కానీ తన జీవితంలో బాక్సర్ అయిన తన తండ్రి ద్వారా కలిగిన బాధ, అవమానాల ప్రభావంతో ఎలాగైనా బాక్సర్ కావాలని గోల్ పెట్టుకుంటాడు గని. ఈ క్రమంలో తన తల్లికి తెలియకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ పెద్ద బాక్సర్ గా ఎదుగుతాడు. ఈ మధ్యలో మాయ (సాయి మంజ్రేకర్) గనితో ప్రేమలో పడుతుంది. మరి గని ఆమెను ప్రేమించాడా ? లేదా ? ఇంతకీ గని తండ్రి విషయంలో జరిగిన సంఘటన ఏమిటి ? గని తల్లి ఎందుకు బాక్సింగ్ అడొద్దు అని మాట తీసుకుంది ? గని చివరకు ఏమి చేశాడు ? తన తండ్రి కోరికను తీర్చాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో ఎమోషనల్ పాత్రలో నటించిన వరుణ్ తేజ్, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన జగపతిబాబు చాలా సహజంగా నటించాడు. సినిమాలోనే కీలకమైన తండ్రి పాత్రలో నటించిన ఉపేంద్ర ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఉపేంద్ర నటన, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో వరుణ్ తేజ్ నటన చాలా ఎమోషనల్ గా చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన సునీల్ శెట్టి తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలిచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా నటించింది.
అయితే ఈ గని సినిమాలో మ్యాటర్ లేదు. రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ సినిమా బోర్ కొడుతుంది. గని సినిమా దర్శకుడు కిరణ్ బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
వరుణ్ తేజ్ – ఉపేంద్ర నటన,
నేపథ్య సంగీతం,
కొన్ని బాక్సింగ్ సీన్స్,
ఇంటర్వల్ లో అండ్ చివర్లో వచ్చే ట్విస్ట్ లు.
మైనస్ పాయింట్స్ :
వెరీ రెగ్యులర్ ప్లే,
రొటీన్ మెలో డ్రామా,
హీరోయిన్ లవ్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో సాగినా.. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. అలాగే వరుణ్ తేజ్ నటన అండ్ ఉపేంద్ర క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే, కేవలం స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.
Also Read: RRR Movie Success Meet: రాజమౌళి అగ్రిమెంట్ ను బ్రేక్ చేసిన అమీర్ ఖాన్
[…] NTR-ANR: సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ తత్వం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. కానీ తొలితరంలో మాత్రం ఇద్దరి పేర్లే వినిపించేవి. ఎన్టీఆర్ జానపదం, పౌరాణిక సినిమాలతో సత్తా చాటుతుంటే.. ఏఎన్ఆర్ మాత్రం సాంఘిక సినిమాలతో జోరు చూపించేవారు. ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద చాలా సార్లు పోటీ పడ్డారు. ఒకసారి ఎన్టీఆర్ పైచేయి సాధిస్తే.. మరోసారి ఏఎన్ఆర్ హవా చూపించేవారు. […]