UCC Bill : మోడీ హయాంలో ఎవరూ సాధించలేం అనుకున్నవి సాధించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఎవరూ అనుకోలేదు. ట్రిపుల్ తలాక్ రద్దును ఎవరూ ఊహించలేదు. రామమందిరం సఫలీకృతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ దేశంలో ఇవి జరగవు అన్న నిరాశలో ఉన్న జనానికి మోడీ నేను ఉన్నానని సాధించి నిరూపించారు. చట్టసభల్లో 3వ వంతు రిజర్వేషన్లను కూడా మోడీ సాధించారు.
మరి ఇన్ని సాధించిన మోడీకి ఇంపార్టెంట్ ‘యూసీసీ’పై పడ్డారు. అందరికీ ఒకే పౌరసత్వం అనేది ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. కులం, మతం ప్రాతిపదికన విభజించిన ఈ దేశంలో ఇదే అతిపెద్ద సవాల్ గా ఉంది. పెద్ద ఉదారవాదులంతా యూసీసీని వ్యతిరేకిస్తున్నారు. యూసీసీని అమలు చేసే అవకాశాలు మెండుగా వచ్చాయి.
ప్రయోగాత్మకంగా ముందు ఉత్తరాఖండ్ లో అమలు చేయబోతున్నారు. శుక్రవారం ఫిబ్రవరి 2న ఐదుగురితో కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించబోతున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5 నుంచి 8 మధ్య అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించనున్నారు.
మరి అందరికీ ఒకే పౌర చట్టంతో మహిళలకు సమాన న్యాయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.