Poonam Pandey: పూనం పాండే మరణానికి గర్భాశయ క్యాన్సర్ కారణం కాదా?

లాక్ అప్ లో కంగనా రనౌత్ తో పూనం పాండే చాలా చలాకిగా మాట్లాడింది. అంతేకాదు తాను బోల్డ్ పాత్రల్లో నటించడం వెనుక కారణాలు కూడా చెప్పింది. అప్పుడు తనకు అనారోగ్యం ఉందని గాని, లేదా దానితో బాధపడుతున్నానని గాని పూనం చెప్పలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 3, 2024 12:32 pm
Follow us on

Poonam Pandey: ” 32 సంవత్సరాల వయసులో పూనం పాండే చనిపోయారు. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న ఆమె అలా మరణించడం చాలా బాధాకరం. ఆమె మరణానికి గర్భాశయ క్యాన్సర్ కాదేమో.. వేరే ఏదైనా కారణం ఉండి దాన్ని దాచిపెడుతున్నారేమో.. ఏది ఏమైనప్పటికీ ఆమె మరణం గర్భాశయ క్యాన్సర్ ద్వారా సంభవించింది మాత్రం కాదు. ఎందుకంటే గర్భాశయ క్యాన్సర్ సోకిన రోగులు హఠాత్తుగా చనిపోరు” ఇవీ నిన్న పూనం పాండే చనిపోయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వెల్లువెతుకుతున్న సందేశాలు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్.. ఇలా ప్రతి వేదికలోనూ ఇలాంటి సందేహాలే ఆమె అభిమానులు, నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.” మూడు రోజుల క్రితమే ఆమె గోవాలో ఒక పార్టీని ఆస్వాదిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాంటి మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయింది అంటే నమ్మలేకపోతున్నామని” నెటిజన్లు వాపోతున్నారు. పూనం పాండే మృతికి సంబంధించిన ఫోటోలను బయటకు విడుదల చేయకపోవడం, కనీసం వారి ఇంట్లోకి బయట వ్యక్తులను అనుమతించకపోవడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి. మరోవైపు పూనమ్ పాండే స్టంట్స్ చేస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.. అలా చేసే క్రమంలో ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చని.. అది ఆమె మరణానికి దారి తీయవచ్చు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె మరణానికి సంబంధించి ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు ఒక స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఆమె మేనేజర్ చెప్పిన విషయాల ఆధారంగానే మీడియా రకరకాల కథనాలు అల్లేస్తోంది. అయితే జరుగుతున్న పరిణామాలు ఆమె మరణం పట్ల అనుమానాలను మరింత పెంచుతున్నాయి.

లాక్ అప్ లో కంగనా రనౌత్ తో పూనం పాండే చాలా చలాకిగా మాట్లాడింది. అంతేకాదు తాను బోల్డ్ పాత్రల్లో నటించడం వెనుక కారణాలు కూడా చెప్పింది. అప్పుడు తనకు అనారోగ్యం ఉందని గాని, లేదా దానితో బాధపడుతున్నానని గాని పూనం చెప్పలేదు. పైగా పూనం సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనం.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తనను అనుసరిస్తున్న వారితో పంచుకునేది. పైగా బోల్డ్ ఫోటో షూట్ తో కుర్ర కారు మతులు పోగొట్టేది. తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైనప్పటికీ దానికి సంబంధించిన బాధను ఆమె ఎప్పుడూ వ్యక్తీకరించలేదు. ఇక నిన్న పూనం పాండే చనిపోయిన తర్వాత.. ఆ విషయాన్ని ఆమె వ్యక్తిగత మేనేజర్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించిన తర్వాత.. సామాజిక మాధ్యమాలలో పూనమ్ పాండేను అనుసరిస్తున్న కొంతమంది వైద్యులు స్పందించారు.” ఇప్పుడున్న పరిస్థితులలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద ప్రమాదమైన వ్యాధి కాదు. దానికి సంబంధించి చికిత్స విధానాలు ఉన్నాయి. పైగా పూనమ్ పాండే సెలబ్రిటీ కాబట్టి పెద్దపెద్ద ఆసుపత్రులలో చికిత్స చేయించుకునే స్థోమత ఆమెకు ఉంది. అయినప్పటికీ ఆమె ఆ వ్యాధితో మరణించింది అని ప్రకటించారు. బహుశా ఆమె మరణానికి ఆ వ్యాధి కాకుండా ఇంకా ఏదో కారణం అయి ఉండొచ్చని” కొంతమంది వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. వారు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ఆమె మేనేజర్ ప్రస్తుతం పూనమ్ పాండే కుటుంబం తీవ్రమైన దుఃఖంలో ఉందని, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరడం అనుమానాలకు తావిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. లేకుంటే ఆమె సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఖాతాలు ఏమైనా హ్యాక్ కు గురయ్యాయా అంటూ సందేహాలు వెలిబుచ్చుతున్నారు.

పూనం పాండే మరణాన్ని ఆమె మేనేజర్ సామాజిక మాధ్యమాలలో అధికారికంగా ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వివాదాస్పద నటి కావడంతో చాలామంది ఆమె మరణానికి సంబంధించి కారణాలను ఆరా తీయడం మొదలుపెట్టారు. జాతీయ మీడియా కూడా ఆమె మరణానికి సంబంధించిన వార్తలకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చింది. 2013 నషా అనే చిత్రంతో పూనం పాండే సినీ రంగంలోకి ప్రవేశించింది. నషా చిత్రంలో స్టూడెంట్ తో ఎఫైర్ పెట్టుకొనే టీచర్ పాత్రలో ఆమె నటించింది. అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించి వివాదం తలెత్తింది. ఆ చిత్రం పోస్టర్లను చాలామంది తగలబెట్టారు. అయితే ఒక అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టారు. 2011లో భారత జట్టు క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా నటిస్తానని చాలెంజ్ చేసి ఒక్క సారిగా వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించింది. ఎక్కువగా బోల్డ్ పాత్రల్లోనే నటించింది. 2022లో కంగనా రనౌత్ హోస్టుగా వ్యవహరించిన లాక్ అప్ లో ఆమె కనిపించింది. తెలుగులో మాలిని అండ్ కో అనే సినిమాలో నటించింది.