H-1B Visa New Rules And Updates: అగ్రరాజ్యాం అమెరికా వీసాల పునరుద్ధరణ, జారీ అంశాలపై వరుసగా ప్రకటనలు ఇస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలో భారత్‌తోపాటు ఇతర దేశాలకు పౌరులకు ఎన్ని వీసాలు జారీ చేసిందో తెలిపింది. తర్వాత హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా 2024 ఏడాది హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
అప్లికేషన్ సులభతరం
అమెరికా ఈ ఏడాది ప్రత్యేక హెచ్–1బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. మోసాలకు చెక్‌పెట్టేలా ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్–1 బీ వీసా అప్లికేషన్ ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129, ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్‌కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907లను సులభంగా అప్లై చేయవచ్చు. ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం.జాడౌ తెలిపారు. ఐ –129, హెచ్ –1బీ పిటిషన్ల ఆన్లైన్ ఫైలింగ్‌ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ –1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్‌పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్లైన్ అవుతుందని పేర్కొన్నారు.
అప్డేట్స్ ఇవీ..
– 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024, మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది. దీనిని వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పీరియడ్ అంటారు. ఈ స్వల్ప వ్యవధిలో హోచ్–1బీ వీసా స్పాన్సర్ చేయాలనుకుంటే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి.
– ఏటా 65 వేల హెచ్–1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్, జారీ చేస్తుంది. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20 వేల మంది విదేశీ విద్యార్థులకు ఈ వీసాలు అందిస్తుంది.
– 2025లో సైతం నిబంధనల ప్రకారం 65 వేల హెచ్–1బీ వీసాలు జారీ చేస్తామని తెలిపింది. యూఎస్సీఐఎస్ విభాగం హెచ్–1బీ వీసాల దరఖాస్తులను అక్టోబర్ 1 నుంచి స్వీకరించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది.
– అక్టోబర్ నుంచి హెచ్–1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తూ మోసాలను తగ్గించేలా వీసాల జారీపై కొత్త నిబంధనలు అమలు చేయనుంది.
– వీసాల కోసం దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు లేదా చెల్లని డాక్యుమెంట్లు జతచేస్తే హెచ్–1బీ దరఖాస్తు తిరస్కరిస్తామని యూఎస్సీఐఎస్ అధికారులు తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Us announces latest selection criteria for h 1b visa new rules from october
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com