Uttarakhand UCC Bill : దేశం మొత్తం అయోధ్య రామమందిర ఘటన మీదనే చర్చోపచర్చలు వారంపాటు సాగాయి. అది అయిపోయింది.. వచ్చే వారం ఫిబ్రవరి 5వ తేదీ ఇంకో చరిత్రాత్మక ఘట్ఠం జరుగబోతోంది. రామమందిరం తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీయబోతోంది.
అదే ఉమ్మడి పౌరస్మృతి. దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం.. ఇది ప్రధానమైన చట్టం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టినా సాధ్యపడడం లేదు. దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేయాలని చూస్తున్నారు.
ఫిబ్రవరి 2022లో ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రణాళికలో ‘యూసీసీ’ అమలు చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2022 మే నెలలో జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఐదుగురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ రాష్ట్రంలో యూసీసీ అమలు చేస్తే అది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.
దేశానికి దిశా నిర్దేశం చేయబోతున్న ఉత్తరాఖండ్ ‘యూసీసీ’ నిర్ణయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.