Homeప్రత్యేకంUCC Bill : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే UCC బిల్లు

UCC Bill : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే UCC బిల్లు

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే UCC బిల్లు పెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ బిల్లు ప్రాముఖ్యత.. అమలైతే లాభనష్టాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

UCC Bill : కేంద్రం తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి వ్యవహారంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ఈ వివాదాస్పద అంశాన్ని లేవనెత్తారని మండిపడుతున్నాయి. “ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి కీలక సమస్యల నుంచి, మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దీనిని తెరపైకి తెచ్చారు. ” అని ఆరోపిస్తున్నాయి. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్‌, బీజేడీ, శివసేన (ఉద్ధవ్‌) ఉమ్మడి కోడ్‌కు మద్దతు ప్రకటించాయి. ఎన్‌సీపీ తటస్థ వైఖరితో ఉండగా.. కాంగ్రెస్‌, జేడీయూ, టీఎంసీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ, వామపక్షాలు సహా మిగతా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జూన్‌ 14వ తేదీన లా కమిషన్‌ యూసీసీపై ప్రజాభిప్రాయం కోరుతూ ‘వ్యక్తిగత చట్టాలపై సమీక్ష’ పేరిట పబ్లిక్‌ నోటీసు విడుదల చేసింది. దీనికి జూన్‌ 27 వరకు 8.5 లక్షల అభిప్రాయాలు వచ్చాయి.

త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాది సార్వత్రిక ఎన్నికలు.. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో వివాదాస్పదమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. తేనె తుట్టే లాంటి ఉమ్మడి పౌర స్మృతిని అమలులోకి తీసుకొచ్చేందుకు బలమైన అడుగులు వేసింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఏకంగా పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు సమాయత్తమైంది. జూలై మూడో వారంలో మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పెట్టాలని నిర్ణయించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. న్యాయశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం జూలై 3న కేంద్ర న్యాయశాఖకు చెందిన చట్టవ్యవహారాలు, శాసనసభ వ్యవహారాల విభాగాలు, లా కమిషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ సందర్భంగా బిల్లుకు తుది తీసుకురావాలని భావిస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాక దీనిని మరింత లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్‌ కమిటీకి పంపుతారని తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతుంది.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే UCC బిల్లు పెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ బిల్లు ప్రాముఖ్యత.. అమలైతే లాభనష్టాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper