HomeతెలంగాణNTV Vs TV9: టీవీ9, ఎన్టీవీ రోడ్డున పడ్డాయి..అందులో పని చేసే జర్నలిస్టులూ ఆ బాపతే

NTV Vs TV9: టీవీ9, ఎన్టీవీ రోడ్డున పడ్డాయి..అందులో పని చేసే జర్నలిస్టులూ ఆ బాపతే

NTV Vs TV9: మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. మీడియా అంటేనే జనాల్లో ఏవగింపు మొదలైందని.. మీడియా ప్రసారం చేసే వార్తలను ఎవడూ నమ్మడం లేదని.. ఇదే సమయంలో నెంబర్ వన్ స్థానం కోసం న్యూస్ ఛానల్స్ అడ్డదారులు తొక్కుతున్నాయని.. ఇప్పుడు ఆ కోవలోకి ఆ చానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా చేరిపోయారు. సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు వీధి పోరాటాలకు దిగారు. నువ్వు అంత చేసావంటే, నువ్వు ఇంత చేసావని పోటీలు పడి తిట్లు తిట్టుకున్నారు. అంతే కాదు ఆ వీడియోలు బయట పెట్టుకొని ఇజ్జత్ తీసుకున్నారు.

https://www.youtube.com/watch?v=qfezlrbwhgc

తెలుగు మీడియాలో బహుశా టీవీ9, ఎన్టీవీ మధ్య ఉన్న పోరాటం మరే ఇతర చానల్స్ మధ్య లేదు కావచ్చు. ఒక దానికి వ్యతిరేకంగా మరొకటి పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. నెంబర్ వన్ స్థానం సాధించినందుకు ఏకంగా రెండు కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది నిన్న మొన్నటి వరకు జరిగింది. కానీ ఇప్పుడు ఆ చానల్స్ లో పనిచేసే జర్నలిస్టులు కూడా వీధి పోరాటాలకు దిగుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు అలా చేశావని, నీ బతుకు గురించి ఎవరికి తెలియదని కామెంట్లు చేసుకుంటున్నారు. సమాజంలో జరిగిన సంఘటనలను వార్తల రూపంలో మలచాల్సిన జర్నలిస్టులు చివరికి వారే వార్తలు కావడం విశేషం.

ఇంతకీ ఏం జరిగింది అంటే

టీవీ9, ఎన్ టీవీ.. తెలుగు మీడియా రంగంలో మొదటి రెండు స్థానంలో కొనసాగుతున్న చానల్స్ ఇవి. నెంబర్ వన్ స్థానం కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్న చానల్స్ కూడా ఇవే. గతంలో టీవీ9 మొదటి స్థానంలో ఉండగా, దానిని ఎన్ టీవీ బీట్ చేసింది. తర్వాత కొద్ది కాలానికి ఎన్ టీవీ ని టీవీ9 బీట్ చేసింది. ఇప్పుడు ఎన్టీవీ టీవీ9 కు అందనంత ఎత్తులోకి ఎదిగిపోయింది. ఇవన్నీ కూడా యాజమాన్యాలకు సంబంధించిన విషయాలు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు నిమిత్తమాత్రులు మాత్రమే. ఇంతోటి దానికి జర్నలిస్టులు ప్రతి విషయాన్ని ఒంటికి పూసుకోవడమే ఇక్కడ అసలు విషయం. ఆమధ్య ఎన్టీవీ రెండవ స్థానానికి పడిపోయినప్పుడు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు టీవీ9 రజినీకాంత్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు క్రియేట్ చేశారు. ఆ తర్వాత టీవీ9 కూడా కుట్రలతో నెంబర్ వన్ స్థానం సాధించలేరు అనే ట్యాగ్ లైన్ తో రెండు కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసింది. ఇక ఈ టీవీ9, ఎన్టీవీ లో పనిచేసే ఇద్దరు మహిళా జర్నలిస్టులు వీధి పోరాటాలకు దిగారు.

https://www.youtube.com/watch?v=F5zNgTcAHn4

ఇద్దరూ మంచి జర్నలిస్టులే

టీవీ9 లో పనిచేసే హసీనా, ఎన్ టీవీలో పనిచేసే రెహనా..ఇద్దరూ కూడా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ జర్నలిస్టులు. ఇద్దరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. అయితే వీరిలో రెహనా ఏపీ సీఎంవో బీట్ చూస్తుంది. ఇక హసీనా అయితే టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ మహాత్మతో కలిసి ఉక్రెయిన్ వార్ కవరేజ్ కూడా చేసింది. అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇక రెహనా కూడా జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా దాడి జరిగినప్పుడు అక్కడికి వెళ్లి కవరేజ్ చేసింది. సో ఇద్దరు కూడా ప్రొఫెషనల్ గా మంచి జర్నలిస్టులే. ఇద్దరికీ ఎక్కడ చెడిందో గానీ మొత్తానికి వీధిన పడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రెహానా కొంచెం ప్రొఫెషనల్ గా వ్యవహరించింది. హసీనా మాత్రం ఆవేశం ఆపుకోలేక ” నీ బతుకు గురించి ఎవరికి తెలియదు. నువ్వు నాకు నీతులు చెబుతున్నావా” అంటూ మాటలు తూలింది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన గొడవ తాలూకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పైగా రెహనాకు సంబంధించిన ఈ మెయిల్స్ మొత్తం తన దగ్గర ఉన్నాయని హసీనా కుండబద్దలు కొట్టింది. ఇక పిట్టల పోరు పిల్లి తీర్చినట్టు.. వీరిద్దరూ గొడవ పడడంతో యాజమాన్యాలు సీరియస్ అయ్యాయి. రెహనాను ఎన్టీవీ యాజమాన్యం విశాఖపట్నంకు బదిలీ చేసింది. హసీనాను టీవీ9 యాజమాన్యం హైదరాబాద్ కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular