Pawan Kalyan: ప్రజా సమస్యలపై స్పందించడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుంటున్నారు. అందరు రాజకీయ నేతల్లా తనకు ఓట్లు వేసే ఆంధ్రా ప్రజలు విద్యార్థులే ముఖ్యం అని భావించడం లేదు. తెలంగాణలో పోటీ లేకపోయినా.. ఇక్కడి ప్రజలతో అవసరం లేకపోయినా కానీ.. ఇక్కడి విద్యార్థుల ఓట్లు జనసేనకు పడవు అయినా కూడా పవన్ కళ్యాణ్ ఓ సదుద్దేశంతో చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సేవానిరతిని అందరూ కొనియాడుతున్నారు. ఆంధ్రా సమస్యలపైనే కాదు.. తెలంగాణలో ఓటు హక్కులేని పదోతరగతి విద్యార్థుల సమస్యలపై కూడా స్పందించి పవన్ శభాష్ అనిపించుకున్నారు. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గిరిజన గూడాలకు చెందిన ఆడబిడ్డలకు బస్సు సౌకర్యం లేక వారు చదువులకు దూరం అవుతున్న విధానంపై పవన్ ప్రశ్నించాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ట్యాగ్ చేసి మరీ సమస్యను పరిష్కరించాలని విన్నవించాడు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లలోని పల్లెచెల్క తండా,సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడబిడ్డలు మడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్లి చదువుకుంటున్నారు. ఆ తండాల విద్యార్థులంతా విద్యాసంస్థలు విడిచిపెట్టాక బస్సులు లేక నడిచి వెళ్లాల్సి వస్తోంది. అటవీ ప్రాంతం కావడంతో పిల్లలు భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నా సక్రమంగా నడపకపోవడం.. తరచూ ఆ సర్వీసు రద్దు చేయడంతో పిల్లలు భిక్కుబిక్కుమంటూ నడిచి వెళుతున్నారు. ఈ పరిస్థితిని మీడియా వెలుగులోకి తెచ్చింది. విద్యార్థులు పవన్ కు సమస్యను విన్నవించారు. ఈ సమస్యపై ఆర్టీసీ, తెలంగాణ ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలని పవన్ కళ్యాణ్ కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలని.. సదుపాయం లేని అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడి విద్యార్థినులు చదువు మధ్యలో వదిలేసే పరిస్థితి రాకూడదన్నారు. ఈ మేరకు ట్యాగ్ చేసి మరీ సమస్యను లేవనెత్తారు.
దీంతో దెబ్బకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆయన ఆఫీస్ పవన్ ట్వీట్ కు సమాధానం ఇచ్చింది. దసరా సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో ఆ బస్ సర్వీసును రద్దు చేశామని.. ఇప్పుడు పునరుద్దరించామని ఆర్టీసీ సంస్థ తెలిపింది. సజ్జనార్ ఈ మేరకు పవన్ కు వివరణ ఇచ్చారు.
ఇలా ఒక్క ట్వీట్ తోనే తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించిన జనసేనాని పవన్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
This Service is regularly operated for school students as scheduled. During the Dussehra school holidays, this trip was not operated. However, After the reopening of schools, the service is restored. Yesterday this trip was operated late by 1 hr 30 mins due to traffic congestion. https://t.co/juYqsk4dJX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 12, 2022