https://oktelugu.com/

Kerala : కేరళలో ముక్కోణపు పోటీ జరుగుతున్న నియోజక వర్గాలేవి?

కేరళలో ముక్కోణపు పోటీ జరుగుతున్న నియోజక వర్గాలేవి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : March 13, 2024 / 03:25 PM IST

కేరళ ఎన్నికలు మిగతా రాష్ట్రాల కన్నా ప్రచారం జోరుగా సాగుతున్నాయి. యూడీఎఫ్, ఎల్డీఎఫ్, బీజేపీలు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఇక్కడ కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి.

పోయిన సారి 2019లో యూడీఎఫ్ (కాంగ్రెస్) 19 ఎంపీ స్థానాలు గెలిచాయి. ఎల్డీఎఫ్ అలప్పుజూ మాత్రమే గెలిచింది. ఈసారి పరిస్థితి ఎలా ఉందని చూస్తే.. కాంగ్రెస్ కు భయం పట్టుకుంది.

2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ఎల్డీఎఫ్ గెలిచింది. సీపీఎం అధికారంలోకి వచ్చింది.2021 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కేవలం యూడీఎఫ్ కు 6 స్థానాల్లోనే మెజార్టీ వచ్చింది. వయనాడులో 4 లక్షలకు పైగా మెజార్టీతో రాహుల్ గాంధీ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ 38వేలకు పడిపోయింది.

తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నుంచి నిలబడ్డ శశిథరూర్ లక్ష మెజార్టీతో గెలిస్తే 2021లో ఎల్డీఎఫ్ లో లక్ష మెజార్టీ వచ్చింది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన కేరళ ప్రజలు.. అసెంబ్లీకి వచ్చేసరికి సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ను గెలిపించారు.

కేరళలో ముక్కోణపు పోటీ జరుగుతున్న నియోజక వర్గాలేవి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

కేరళలో ముక్కోణపు పోటీ జరుగుతున్న నియోజక వర్గాలేవి? || Triangle Fight in Kerala || LDF vs UDF vs BJP