Chandra Mohan Passed Away: చంద్రమోహన్ : స్టార్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ.. అన్ని పాత్రలు ఆయనవే!

దిగ్గజ దర్శక నిర్మాత బి ఎన్ రెడ్డి దృష్టిలో పడిన చంద్రమోహన్ ఆయన దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆయన తెరకెక్కించిన రంగులరాట్నం మూవీలో చంద్రమోహన్ హీరోగా నటించాడు.

Written By: NARESH, Updated On : November 11, 2023 11:21 am

Chandra Mohan Passed Away

Follow us on

Chandra Mohan Passed Away: సుదీర్ఘ కాలం చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన చంద్రమోహన్ ఇకలేరు. ఆయన నేడు(నవంబర్ 11)ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చంద్రమోహన్ కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 23 మే 1943లో జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. చదువుకునే రోజుల్లోనే నటనపై మక్కువ పెంచుకున్నాడు. నాటకాలు ఆడుతూ నటనలో పరిణితి సాధించాడు.

దిగ్గజ దర్శక నిర్మాత బి ఎన్ రెడ్డి దృష్టిలో పడిన చంద్రమోహన్ ఆయన దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆయన తెరకెక్కించిన రంగులరాట్నం మూవీలో చంద్రమోహన్ హీరోగా నటించాడు. చంద్రశేఖర్ ని చంద్రమోహన్ గా బి ఎన్ రెడ్డి. చక్కని రూపం ఉన్న చంద్రమోహన్ కి హైట్ మైనస్ అయ్యింది. దీని వలన ఆయన పూర్తి స్థాయి హీరోగా రాణించలేకపోయాడు.

అందుకే హీరోగా తన ఆహార్యానికి తగిన పాత్రలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండేవారు. ఆయన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయసుధ, శ్రీదేవి, జయప్రద, వాణిశ్రీ, విజయశాంతి స్టార్ హీరోయిన్స్ అయ్యారు. ఇదొక క్రేజీ సెంటిమెంట్ ఆయన సొంతం చేసుకున్నారు. కళాతపస్వి కే విశ్వనాథ్ చంద్రమోహన్ కి బంధువు. ఆయన కజిన్ అవుతారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, సిరిసిరిమువ్వలు… విశ్వనాథ్-చంద్రమోహన్ కాంబోలో వచ్చిన క్లాసిక్స్…

పదహారేళ్ళ వయసు మూవీలో అవిటివాడిగా డీగ్లామర్ రోల్ లో చంద్రమోహన్ అద్భుతం చేశారు. ఇంటింటి రామాయణం, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలైతే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, మూడు ముళ్ళు, గోపాలరావు గారి అమ్మాయి, పెళ్లి చూపులు, రాధా కళ్యాణం… చిత్రాలతో ఆయన హీరోగా ఆకట్టుకున్నారు. చంద్రమోహన్ కెరీర్ నిర్విరామంగా సాగింది.

50 ఏళ్లకు పైగా ఆయన నటించారు. ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా, ఇలాంటి పాత్రలే చేస్తానని నియమం పెట్టుకోకుండా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా కామెడీ, లవ్ రొమాంటిక్, ఫ్యామిలీ జోనర్స్ చేశారు. రెండు జనరేషన్ హీరోలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ రోల్స్ చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ చేశారు. అలాగే ఎన్టీఆర్, మహేష్ బాబు,ప్రభాస్, గోపీచంద్, రామ్ పోతినేనితో పాటు పలువురు యంగ్ హీరోల చిత్రాల్లో నటించారు. చంద్రమోహన్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు.