Mumbai Municipal Corporation : ముంబై ఎన్నికల ఫలితం.. ఏ టీవీలో చూసినా అదే వస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఎన్నికకు కూడా టీవీ చానెల్స్ ఎందుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి అంటే దేశంలోనే నంబర్ 1 కార్పొరేషన్ ముంబైనే.
ఉద్దవ్ ఠాక్రేకు ఆయువు పట్టు ముంబై. ఈ ముంబై నగరం ఠాక్రేలకు రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దాదాపు 25 ఏళ్లుగా శివసేన చేతుల్లోనే ముంబై కార్పొరేషన్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన చతికిలపడింది. అటువంటిది ఈ ముంబై కార్పొరేషన్ ఎన్నికల ఫలితం ఠాక్రేల చేతుల్లోంచి చేజారిపోవడం.. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది..
అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే.. దేశమొత్తం మీద అత్యంత రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది ముంబై కార్పొరేషన్. గత సంవత్సరం ముంబై బడ్జెట్ 74,427 కోట్లు.. కొన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ మొత్తం చాలా ఎక్కువ. ఈ తరహాలో దగ్గరలో ఏ కార్పొరేషన్ కూడా లేదు.
బడ్జెట్ పరంగా చూస్తే ముంబై దగ్గరలో ఏ కార్పొరేషన్ కూడా లేదు. రెండో రిచెస్ట్ కార్పొరేషన్ బెంగళూరు. దీని బడ్జెట్ 19,927 కోట్లు.. ఎంత తేడానో మీరు అర్థం చేసుకోవచ్చు.
దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ కార్పొరేషన్లు తెలుసా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.