Trivikram NTR Movie Update: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేసినప్పటికి అతనికి అనుకున్న సక్సెస్ అయితే రావడం లేదు. ఇక 2025 వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘వార్ 2’ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ ను సాధించకపోవడంతో పాటుగా భారీగా డీలా పడిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…ఈ సినిమా మీదనే పూర్తి ఆశాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాని ప్రశాంత్ నీల్ సైతం చాలా ప్రస్టేజీయస్ ఇష్యూ గా తీసుకొని మరి చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అనే విషయం కూడా చాలా కీలకంగా మారనుంది. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అనే వార్తలు బయటకు వచ్చాయి.
దాంతో త్రివిక్రమ్ మొదట ఎవ్వరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద క్లారిటీ మిస్ అయింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ లోకేష్ కనక రాజ్ తో సినిమాను అనౌన్స్ చేశాడు. కాబట్టి అట్లీ తో చేస్తున్న సినిమా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ ప్రాజెక్టు ను చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశాలైతే లేవు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి ప్రస్తుతం లైన్ క్లియర్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా 800 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…