Tomato Bouncers : టమాటాలు చూడాలనుకో తప్పులేదు.. కొట్టేయాలనుకుంటే మాత్రం..!

‘టమాటా ధరపై ప్రజల్లో హాహాకారాలు వినిపిస్తూనే ఉన్నాయి. నా దుకాణంలోని వ్యక్తులు కూడా బేరసారాలకు ప్రయత్నించారు. కాబట్టి నిరంతరం ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా.. అన్నింటికీ ముగింపు పలికేందుకు, నా కూరగాయల దుకాణం వద్ద యూనిఫాంలో బౌన్సర్లను మోహరించాలని నిర్ణయించుకున్నాను, ”అని అజయ్ ఫౌజీ అనే కూరగాయల వ్యాపారి చెప్పారు.

Written By: NARESH, Updated On : July 10, 2023 10:21 pm
Follow us on

Tomato Bouncers : కాలం కలిసి వస్తే నడిచచ్చే కొడుకు పుడుతాడని నానుడి ఉంది. ఇప్పుడు కాలం కలిసి వచ్చి టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. అందుకే ఇప్పుడు టామాటలు బంగారం అయిపోయాయి. టామాటలకు గిట్టుబాటు ధర లేక పారబోసిన రోజులు ఉన్న రోజులు పోయి ఇప్పుడు కిలో టమాటా 160 రూపాయలకు చేరింది. అవును ఏకంగా టమాట కోసం దోపిడీలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందుకే టమాటలకు సెక్యూరిటీ కూడా కల్పిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఒక కూరగాయల వ్యాపారి టమాటలకు రక్షణగా సెక్యూరిటీ గార్డులను నియమించాడు. గత కొద్ది రోజులుగా టమాటాలు కొనడానికి వచ్చినప్పుడు వినియోగదారులు వాటిని దొంగిలించకుండా.. దూరంగా ఉంచడానికి బౌన్సర్‌లను నియమించుకున్నాడు. టమాటా ధర గత కొన్ని రోజులుగా భారీగా పెరగడంతో జనాల కన్ను దానిపై ఉండడంతోనే ఇలా చేశాడు.

‘టమాటా ధరపై ప్రజల్లో హాహాకారాలు వినిపిస్తూనే ఉన్నాయి. నా దుకాణంలోని వ్యక్తులు కూడా బేరసారాలకు ప్రయత్నించారు. కాబట్టి నిరంతరం ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా.. అన్నింటికీ ముగింపు పలికేందుకు, నా కూరగాయల దుకాణం వద్ద యూనిఫాంలో బౌన్సర్లను మోహరించాలని నిర్ణయించుకున్నాను, ”అని అజయ్ ఫౌజీ అనే కూరగాయల వ్యాపారి చెప్పారు.

సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త అయిన ఫౌజీ గతంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో టమోటా ఆకారంలో ఉన్న కేక్‌ను కట్ చేశారు. టమాటా దొంగతనాలు దేశంలో పెరిగిపోతుండడంతో రైతులు సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనలు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదయ్యాయి. హాసన్ జిల్లాలోని ఓ టమాటా పొలంలో రాత్రికి రాత్రే రూ.3 లక్షల విలువైన టమోటాలు దొంగిలించబడ్డాయని ఆరోపిస్తూ ఒక రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హాసన్‌లోని హళేబీడు సమీపంలోని గోని సోమనహళ్లి గ్రామంలో జరిగింది. ఈ విషయమై రైతు ధరణి అనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిలో రూ.150 దాటడంతో రూ.3 లక్షల విలువైన 90 టమాటా బాక్సులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

రెండెకరాల భూమిలో టమోటా సాగు చేయగా, ధరణి చిక్కమగళూరు మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. టామాట దొంగతనాలతో రైతులు తమ పొలాల వద్ద పడుకోవలసి వస్తుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపలాగా మార్చుకుంటారు. రుతుపవనాల వల్ల వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఈ దృశ్యం సాధారణంగా దక్షిణ కర్ణాటక జిల్లాలైన కోలార్, హాసన్‌లలో పంటను పెద్ద మొత్తంలో పండిస్తారు.