https://oktelugu.com/

అక్కడ ఒక కప్పు టీ 1,000 రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

సాధారణంగా పల్లెల్లో ఒక కప్పు టీ ధర 5 రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. ప్రముఖ రెస్టారెంట్లలో ఒక కప్పు టీకి 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తీసుకుంటారు. అయితే కోల్ కతాలోని ఒక టీ స్టాల్ లో మాత్రం టీ తాగాలంటే ఏకంగా 1,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ టీ చాలా స్పెషల్ టీ కావడంతో ఈ టీ కోసం ఏకంగా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 2, 2021 11:23 am
    Follow us on

    Kolkata Tea Stall

    సాధారణంగా పల్లెల్లో ఒక కప్పు టీ ధర 5 రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. ప్రముఖ రెస్టారెంట్లలో ఒక కప్పు టీకి 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తీసుకుంటారు. అయితే కోల్ కతాలోని ఒక టీ స్టాల్ లో మాత్రం టీ తాగాలంటే ఏకంగా 1,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ టీ చాలా స్పెషల్ టీ కావడంతో ఈ టీ కోసం ఏకంగా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

    Also Read: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. చిరిగిపోయిన నోట్లను ఎలా మార్చుకోవాలంటే..?

    కోల్ కతాలోని ముకుందాపూర్‌ లో పార్థ ప్రతిమ్ గంగూలీ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల క్రితం టీ స్టాల్ ను తెరిచాడు. ఈ టీ స్టాల్ లో టీ ధర 12 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. టీ స్టాల్ లో గరిష్టంగా టీ ధర 1,000 రూపాయలుగా ఉంది. చాలా ప్రత్యేకమైన టీ కావడం, ఈ టీ ఎంతో రుచిగా ఉండటంతో చాలామంది ఈ టీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బోలే టీ పేరుతో పిలవబడే ఈ టీ కోసం వినియోగించే కేజీ టీ పొడి ధర ఏకంగా రూ.3 లక్షలు.

    Also Read: గూగుల్ సూపర్ ఫీచర్.. మెసేజ్‌కు టైమ్ సెట్ చేసుకునే ఛాన్స్..?

    ఉద్యోగంతో కెరీర్ ను ప్రారంభించిన గంగూలీ ఉద్యోగం నచ్చకపోవడంతో టీ వ్యాపారం మొదలుపెట్టాడు. కార్న్‌బరి టీ, రుబియోస్ టీ, ఒక్టి టీ, హిబిస్కస్ టీ, వైన్ టీ, బాసిల్ జింజర్ టీ పేర్లతో ఈ టీ స్టాల్ లో ఎన్నో వెరైటీ టీలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడైనా కోల్ కతా వెళితే 1,000 రూపాయలు ఖర్చు చేసి ఎంతో రుచిగా ఉండే టీని టేస్ట్ చేయవచ్చు. కోల్ కతా లో నీర్జష్ టీ స్టాల్ పేరుతో గంగూలీ నడిపే టీ స్టాల్ ఎంతో ప్రాచుర్యం పొందింది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    పార్థ ప్రతిమ్ గంగూలీ ఈ టీ స్టాల్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఉద్యోగం వదిలి టీ స్టాల్ నే బిజినెస్ గా ఎంచుకున్న గంగూలీ కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.