HomeజాతీయంBrahamaputra River : దేశంలో ఉన్న ఏకైక మగ నది ఇదే.. దీని చరిత్ర తెలుసా?

Brahamaputra River : దేశంలో ఉన్న ఏకైక మగ నది ఇదే.. దీని చరిత్ర తెలుసా?

Brahamaputra River :  బ్రహ్మపుత్ర నది.. బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి చెందిన ఈ నది భారతదేశంలోనే ఏకైక పురుష (మగ) నదిగా పేరుగాంచింది. ఇది చైనాలోని టిబెట్ లో పుడుతుంది. అక్కడ దీన్ని యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్రను హిందువులు, జైనులు మరియు బౌద్ధులు అత్యంత భక్తిప్రవత్తులతో దేవత నదిగా కొలుస్తారు.

Brahamaputra River
Brahamaputra River

బ్రహ్మ పుత్ర నది మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండవ నది. చైనాలోని టిబెట్ లో గల మానస సరోవర్ సరస్సు సమీపంలో ఉన్న అంగ్సీ హిమానీ నదం నుంచి ఉద్భవించింది. ఇది భారతదేశంలోని ఏకైక ‘మగ నది’గా పిలుస్తారు. అరుణచల్ ప్రదేశ్ లో భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. భారత్ లో దీని మొత్తం పొడువు 916 కిలోమీటర్లు మాత్రమే. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా ‘జమున’ నదిగా సాగి దిగువ గంగ నదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు. వేరొక బ్రహ్మపుత్ర నది ‘మేఘ్నా నదిలో’ కలుస్తుంది. ఈ రెండు నదులు బంగ్లాదేశ్ లోని ‘చాంద్ పూర్’ అనే ప్రదేశంలో కలిసి బంగాళాఖాతంలో కలుస్తాయి.

చాలా కాలం క్రితం చాంగ్ థాంగ్ పీఠభూమి ఒక గొప్ప సరస్సు అని బౌద్ధులు విశ్వసించారు. కరుణామయుడైన బోధిసత్వుడు ఈ సరస్సు నీళ్లు దిగువ ప్రజలకు చేరాలని తీవ్రంగా ప్రయత్నించాడు. యార్లంగ్ త్సాంగ్పో నది దిగువకు ప్రవహించడానికి.. మైదానాలను సుసంపన్నం చేయడానికి హిమాలయ పర్వతాల గుండా ఒక కాలువను సృష్టించాడని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

-బ్రహ్మపుత్ర చరిత్ర
హిందువులకు దేవుడైన బ్రహ్మ-అమోఘాల కుమారుడే బ్రహ్మపుత్ర.. శంతను మహర్షి కూతురైన అమోఘ అందమైన రూపానికి.. ఆమె అందానికి బ్రహ్మ మంత్రముగ్ధుడై వివాహమాడాడని చరిత్రలో చెబుతారు. అమోఘాతో కాపురం చేయగా.. ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని.. మహర్షి శంతనుడు ఈ ‘బ్రహ్మ కుమారుడిని’ కైలాస, గంధమాదన, జరూధి మరియు సంబ్వర్తక్క అనే నాలుగు గొప్ప పర్వతాల మధ్యలో ఉంచాడని చెబుతారు. అతను ‘బ్రహ్మ కుండ్’ అనే గొప్ప సరస్సుగా ఎదిగాడని చెబుతారు. పరశురాముడు తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందేందుకు ఈ నదిలో పుణ్యస్నానం చేయమని గొప్ప ఋషులు సలహా ఇచ్చారు. నది దిగువకు ప్రవహించడానికి.. మానవాళిని ఆశీర్వదించడానికి అతను పర్వతం యొక్క ఒక వైపున గొడ్డలితో దారి మళ్లించాడు.. దాన్ని కిందకు భారతదేశం వైపునకు ప్రవహించేలా చేశాడని ప్రతీతి.

టిబెట్‌లోని కైలాష్ శ్రేణిలోని చెమయుంగ్‌డుంగ్ గ్లేసియర్‌లో ‘టిబెటన్ ఊయల’గా పిలువబడే యార్లంగ్ త్సాంగ్పో నదినే భారత్ లో ‘బ్రహ్మపుత్ర’గా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది..టిబెట్ నుండి అత్యంత వేగంగా కిందకు ప్రవహించే నదిగా గుర్తింపు పొందింది. మొదట తూర్పు వైపు 1,000 కి.మీ ప్రవహిస్తుంది, తర్వాత పెమాకోప్ ప్రాంతంలోని భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాదియాలోని నామ్చే బర్వా దగ్గర పడమర వైపు గుర్రపు షూ ఆకారంలో వంపు ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈ నదికి ‘సియాంగ్’ అని నామకరణం చేశారు. నామ్చే బర్వా (7,782 మీ.) మరియు గియాలా పెరి (7,294 మీ.) రెండు విభిన్న శిఖరాలు.. ఇవి హిమాలయాల తూర్పు చివరన ఉంటాయి. ఈ రెండు నదుల మధ్య నుంచి బ్రహ్మపుత్ర వంపును తీసుకొని భారత్ లోకి వస్తుంది.

Also Read: Cyclone Alert In AP: ఏపీకి హైఅలర్ట్.. తీవ్ర తుఫాను హెచ్చరిక

బ్రహ్మపుత్ర ప్రతి సంవత్సరం భారీ వరదలు సృష్టిస్తుంది. ఆ వరద తాకిడికి దాని గమనాన్ని మారుస్తుంది. తద్వారా కొత్త భూభాగాలు దీని తీరంలో ఏర్పడుతుంటాయి.

ఈ నది బేసిన్‌లో స్థిరపడిన ప్రజల జీవనాడిగా బ్రహ్మపుత్ర నది పేరుగాంచింది. మనుషులు.. వస్తువులను రవాణా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మత్స్యకారులు, పడవలు నడిపేవారు.. రోజువారీ కూలీలుగా ఉపాధి మార్గాలను అందిస్తున్న ఈ నది దాని ఒడ్డున నివసించే ప్రజల సామాజిక-ఆర్థిక జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇది నీటిపారుదల.. నావిగేషన్ లకు ముఖ్యమైన మూలంగా వర్ధిల్లుతోంది.

ఈ పరీవాహక ప్రాంతంలోని గొప్ప వర్షారణ్యాలు అనేక రకాల వృక్షజాతులు.. జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి. అనేక స్థావరాలు ఉన్నాయి. ఇది కజిరంగా, మానస్ మరియు కాంచన్‌గంగా వంటి జాతీయ ఉద్యానవనాలను కలిగి ఉంది. దేశంలోని గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, కృష్ణా, సింధూ, మహా, కావేరి, తపతి అన్నీ నదులు స్త్రీ నామాలతోనే పెట్టారు. వీటన్నింటిని నదీమ తల్లులు అని కొలుస్తారు. ఒక్క బ్రహ్మపుత్ర మాత్రమే మగనదిగా.. బ్రహ్మ పుత్రుడిగా పేరుగాంచింది.

Also Read: Bhala Thandanana: ప్చ్.. పరిణతి పెరిగింది.. సినిమా ప్లాప్ అయ్యింది !

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular