దేశంలో కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా ఈరోజు థియేటర్లలో పెద్దన్న, మంచిరోజులు వచ్చాయి, ఎనిమీ సినిమాలు విడుదలయ్యాయి. అయితే పండుగ సందర్భంగా పలువురు పెద్ద హీరోల సినిమలతో పాటు చిన్న హీరోల సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్ ప్రోమోలు, లిరికల్ వీడియోలు రిలీజయ్యాయి.
క్రాక్ సక్సెస్ తర్వాత రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖిలాడీ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన ఖిలాడీ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్షసుడు సినిమా తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఖిలాడీ కావడం గమనార్హం.
బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా నుంచి దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదలైంది. భమ్.. అఖండ అంటూ లిరిక్స్ తో సాగే ఈ పాటలో బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీలో నటిస్తుండగా శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. జగపతి బాబు, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆచార్య సినిమా నుంచి నీలాంబరి సాంగ్ ప్రోమో నేడు విడుదలైంది. మణిశర్మ ఈ పాటకు సంగీతం సమకూర్చగా నవంబర్ 5వ తేదీ ఉదయం 11.07 గంటలకు నీలాంబరి ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 5వ సినిమా కావడం గమనార్హం.
మారుతి డైరెక్షన్ లో గోపీచంద్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ నెల 8వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. సరైన సక్సెస్ లేని గోపీచంద్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన మంచిరోజులు వచ్చాయి సినిమా నేడు థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లైగర్ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తుండగా నేడు మైక్ టైసన్ పిడికలి బిగించిన పోస్టర్ రిలీజైంది. మైక్ టైసన్ ఫ్యాన్స్ ను ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా ఎఫ్3, గని, డేగల బాబ్జీ, మిషన్ ఇంపాజిబుల్, లక్ష్య, అతిధి దేవోభవ, ఇందువదన, పుష్పక విమానం, జెట్టీ, రౌడీ బాయ్స్, కురుప్, గ్యాంగ్ స్టర్ గంగరాజు, ఆటో రజినీ, బలమెవ్వడు. 1997, బుజ్జీ ఇలారా పోస్టర్ లు రిలీజయ్యాయి.














కళ్యాణ్ దేవ్, రుచితా రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ మచ్చి టీజర్ నేడు రిలీజ్ కాగా ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈరోజు మరికొన్ని సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.