Jr Ntr: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. మెగా , నందమూరి ఫ్యామిలీలకు చెందిన హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా 2020 జనవరి 7 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పులితో పోరాడుతున్న పోస్టర్ పై ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ లోని గ్లింప్స్ లో ఎన్టీఆర్ పులితో పోరాడుతున్న సన్నివేశం హైలెట్ అయింది. అయితే ఆ పులి బ్రిటిష్ సైనికుడి పై దాడి కూడా చేస్తుంది. దీంతో ఎన్టీఆర్ కు పులి ఉన్న సంబంధం ఏంటి అని ఇండస్ట్రి వర్గాల్లో ఫుల్ గా చర్చించుకుంటున్నారు. ఈ మేరకు ఆ స్టోరీ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తాడట. అప్పుడు ఆ పులి ఎన్టీఆర్ కు లొంగి పోతుంది. ఈ నేపథ్యంలో ఓసారి ఎన్టీఆర్ బ్రిటిష్ వారిపై పోరాడుతుంటే… తన యజమాని కోసం పులి బ్రిటిష్ వారితో పోరాడుతుందట. దీని వెనుక ఇంత స్టోరీ ఉంది అంటూ ఆ సన్నివేశానికి చెందిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. మరి ఈ స్టోరీ నిజమో కాదో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.