Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరు కలిసి ఈ మూవీ చేస్తుండడంతో మూవీపై దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా చేస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్రబృందం.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ సాంగ్‌ను మూవీ టీమ్ షూట్ చేస్తోంది. అయితే ఈ పాటలో ఎన్నడూ లేని విధంగా 1000 మంది డ్యాన్సర్లతో రూపొందిస్తుండటం విశేషం. దీపావళి కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పాట థియేటర్లలో 1000 మంది డాన్సర్లు స్టెప్పులు వేస్తుంటే ఏ రేంజ్ లో ఉంటుందో అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
A rocking number from #PushpaTheRise is currently being shot on a grand scale with over 1000 dancers 🤘🤘
This is going to be a masss feast on the Big Screen 💥💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/vF6RRB2XIW
— Pushpa (@PushpaMovie) November 4, 2021
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి సామి’, పాటలు అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. ఇక ఈ పాటతో అల్లు అర్జున్ ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలి. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.