Theaters Close In AP: తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో భాగం అయిపోయిన సినిమా భవితవ్యానికి ఆంధ్రలో ఏర్పడిన సమస్యల సుడిగుండం ఇప్పట్లో తొలిగిపోయేలా లేదు. ఆన్ లైన్ టిక్కెట్లు ద్వారా సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని జగన్ ప్రభుత్వం వేసిన ప్లాన్స్ ను సినిమా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. డిమాండ్ ఉంటే వ్యాపారం చెయ్యొచ్చు. కానీ.. ఎవరో సొమ్ములతో మరెవరో వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలి అనుకోవడం అవివేకం.

అయినా తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టడానికి ఎవరు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు. ప్రభుత్వం అంటే.. ఐదేళ్ల అధికారిక పార్టీ అంతే. అదేం శాశ్వతం కాదు కదా. పైగా జగన్ పై ఎవరికీ ఎలాంటి నమ్మకం లేదు. అందుకే.. ప్రభుత్వం చెప్పేది వినేదాని కన్నా ధియేటర్లు మూసుకోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు థియేటర్ల యజమానులు.
Also Read: Atmakur By Poll Results: ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం.. మెజార్టీ ఎంతో తెలుసా?
మరోపక్క ప్రభుత్వం చాలా రకాలుగా బెదిరింపులకు పాల్పడుతుంది. అయినా థియేటర్ల యజమానులు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ప్రభుత్వ పెద్దలు ఏమి చెప్పినా సినిమా ఎగ్జిబిటర్లు నమ్మడం లేదు. ఇప్పటికే ఈస్ట్ గోదావరిలో ధియేటర్లన్నీ మూసి వేయాలని నిర్ణయించుకున్నారు. పైగా రానున్న రోజుల్లో ఇతర జిల్లాల వాళ్లు కూడా ఇదే నిర్ణయం తీసుకోవచ్చు అని టాక్ నడుస్తోంది.

కారణం ఒక్కటే.. జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి రోజు ఏపీలో సినిమా ధియేటర్లకు వచ్చే కలెక్షన్స్ ప్రభుత్వం ఖాతాలో పడబోతున్నాయి. ఆ డబ్బులను ప్రభుత్వం తర్వాత రోజు ఇస్తోందట. నిజంగా ఇస్తారని సినిమా వాళ్ళు ఎవరూ నమ్మడం లేదు. ఇక్కడే వచ్చింది సమస్య. అందుకే ఎంవోయూకు థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. ఎంవోయూ చేసుకోకపోతే .. అనుమతులన్నీ రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం ఏమిటి చెప్పేది ? మేమె థియేటర్లను మూసేస్తాం అని థియేటర్ల యజమానులు ధియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. మరి చివరకు ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. అసలే ధియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది. దానికి తోడు ధియేటర్లకు వచ్చే జనం సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతూ ఉంది. ఇలా అయితే సినిమా బతికేది ఎలా ?.
Also Read: Corona Merger In India: భారత్ లో కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే?
[…] […]
[…] […]